తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టంగా చెబుతోంది.
సోదాల వ్యవహారం మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో మొదలైంది. కేసీయార్ కుటుంబసభ్యులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ కుటుంబంలోని ప్రముఖులకు అత్యంత సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వారిపై ఈడీ వరసగా సోదాలు చేస్తోంది. ఎలాగైనా కేసీయార్ కుటుంబంలోని కీలక వ్యక్తులను ఫిక్స్ చేయటమే ఈడీ టార్గెట్ గా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే పదే పదే సోదాలు జరుగుతున్నాయి.
సోదాల్లో భాగంగా ఇప్పటికే చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటం, అనేకమంది నేతల వ్యక్తిగత ఆదాయ వివరాలు ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు దగ్గర దొరికాయట. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ టార్గెట్ రీచయ్యేంతవరకు ఈడీ సోదాలు చేస్తునే ఉంటుందని అర్దమవుతోంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేషనల్ హెరాల్డ్ మీడియా ముసుగులోను దాని అనుబంధ సంస్ధల వ్యవహారాల్లో విచారణకు హాజరు కావాలని షబ్బీర్ ఆలీ, రేణుకాచౌదరి, గీతారెడ్డి లాంటి సీనియర్లకు నోటీసులిచ్చింది. విచారణ పేరుతో తమచుట్టూ ఈడీ ఎన్నిసార్లు తిప్పించుకున్నా అడిగేవారే లేరు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే తొందరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికే కారణమని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కష్టమట. దాంతో ఎలాగైనా గెలవాలన్న ప్లాన్ తోనే ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బందులు పెట్టాలని బీజేపీ డిసైడ్ అయ్యిందనే ఆరోపణలు పెరిగిపోతోంది.
This post was last modified on %s = human-readable time difference 10:27 am
నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా…
తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…