Political News

మోడీకి షాక్ ఇచ్చిన వెంక‌య్య నాయుడు.. కీల‌క కామెంట్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఎక్క‌డ వేదిక ఎక్కినా.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించే మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు.. తాజాగా సీరియ‌స్ కామెంట్లు చేశారు. మోడీపై ఒక‌ర‌కంగా.. సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లే చేశార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. విప‌క్షాల‌కు క్ర‌మ శిక్ష‌ణ లేద‌ని.. వారికి రాజ‌కీయాల ప‌ట్ల నిబద్ధ‌త లేద‌ని.. ప్ర‌తిదాన్నీ.. రాజ‌కీయం చేస్తార‌ని.. ఇలా విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. దాదాపు ఆయ‌న బీజేపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే న‌డుచుకున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

అలాంటిది.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా.. ఉన్న స‌మ‌యంలో మోడీని ఆకాశానికి ఎత్తిన నోటితో.. తాజాగా అదే మోడీపై వెంక‌య్య వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. విప‌క్షాల త‌రుఫున గ‌ట్టి గ‌ళ‌మే వినిపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షాలు.. శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్థులేనని గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని మోడీ తరచుగా అన్ని పక్షాల రాజకీయ నాయకులను కలవాలని ఆయన సూచించారు. మోడీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా సుతిమెత్త‌గా మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. , రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఒకే స‌మ‌యంలో మోడీ కూడా.. రాజ‌కీయ పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌కీయ పార్టీలు.. అర్బ‌న్ న‌క్స‌ల్స్‌కు అండ‌గా ఉంటున్నాయ‌ని.. దీంతో దేశంలో అభివృద్ధి ముందుకు సాగ‌డం లేద‌ని.. అన్నారు. అంటే..ప‌రోక్షంగా ఆయ‌న విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలో వెంక‌య్య చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య ఇటీవ‌లే.. ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అయితే.. ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చి.. రాష్ట్ర‌ప‌తిని చేస్తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అది జ‌ర‌గ‌లేదు. పోనీ.. ప్ర‌మోష‌న్ కాక‌పోయినా.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగాఅయినా.. ఆయ‌న‌కు రెన్యువ‌ల్ ఉంటుంద‌ని భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఒకింత మ‌న‌స్తాపంతో ఉన్న వెంక‌య్య‌.. ఇలా బ్లాస్ట్ అయ్యారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 23, 2022 10:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…

1 hour ago

లోకేష్‌తో సినిమాపై తేల్చేసిన స్టార్ హీరో

కూలీ సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో.. ఎన్ని ఊహాగానాలు…

2 hours ago

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

5 hours ago

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…

7 hours ago

మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…

9 hours ago

జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…

9 hours ago