రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షాకిచ్చారు. జోడు పదవుల్లో కంటిన్యు అవుదామని అనుకున్న అశోక్ కి నిరాస తప్పలేదు. వచ్చే నెల 17వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో అశోక్ పోటీ చేస్తున్నారు. అశోక్ తో పాటు శశిథరూర్ కూడా పోటీకి రెడీ అయ్యారు. ఇంకా ఎంతమంది రంగంలోకి దిగుతారో తెలీదు.
ఈ విషయం ఇలాగుంటే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి తో పాటు రాజస్ధాన్ సీఎంగా కూడా కంటిన్యు అవ్వాలని అశోక్ పట్టుదలగా ఉన్నారు. తనకు రెండు కాదు మూడు పదవులను నిర్వహించేంత సామర్ధ్యం ఉందని పదే పదే చెప్పారు. అశోక్ సమస్య ఏమిటంటే తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సుండటమే. సీఎంగా తప్పుకోవటానికి అశోక్ ఎంతమాత్రం ఇష్టపడటంలేదు. కారణం ఏమిటంటే తన బద్ధశత్రువు సచిన్ పైలెట్ ఎక్కడ సీఎం అవుతారో అనే ఆందోళన అశోక్ లో స్పష్టంగా కనబడుతోంది.
సచిన్ ను అడ్డుకోవటంలో భాగంగానే జోడు పదవుల నిర్వహణంటు పట్టుబడుతున్నారు. అయితే అశోక్ ఆలోచనలకు రాహుల్ పెద్ద షాకిచ్చారు. ఎట్టి పరిస్ధితుల్లోను జోడు పదవులు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్నపుడు సీఎం పదవిని వదులుకోవాల్సిందేని చెప్పేశారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని అశోక్ తన వారసుడిగా అసెంబ్లీ స్పీకర్ జోషీని ప్రతిపాదించినట్లు సమాచారం.
అంటే సచిన్ ను సీఎం కానివ్వకుండా అడ్డుకోవటమే అశోక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. నిజానికి రాజస్ధాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం అవ్వాల్సింది సచినే. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ బలోపేతానికి ఎక్కువ కష్టపడింది సచిన్ మాత్రమే. అప్పట్లో కష్టమంతా సచిన్ ది అయితే సీఎం కుర్చీలో కూర్చున్నది మాత్రం అశోక్. పోనీ ఇప్పుడైనీ సచిన్ కు అవకాశం వస్తుందని అనుకుంటే ఇపుడు కూడా రాకుండా అశోక్ అడ్డుకుంటున్నారు. చివరకు రాజస్ధాన్ రాజకీయం ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on September 23, 2022 12:22 pm
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…