ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి చాలా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ తేల్చిచెప్పింది. ఈ మద్యనే జరిగినా పార్టీ ప్లీనరీ సమావేశంలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా నేతలు తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం చెల్లదని అప్పట్లోనే అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీల్లో అధ్యక్ష పదవిని ఎన్నిక ద్వారా మాత్రమే భర్తీ చేయాలి కానీ నామినేషన్ ద్వారా కాదు.
తన శాశ్వత అధ్యక్ష పదవి కమీషన్ నిబంధనల ప్రకారం చెల్లదని తెలిసినా అదే తీర్మానాన్ని చేయించుకున్నారు. దాంతో మీడియాలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా వైసీపీకి కమీషన్ నోటీసులిచ్చింది. అయితే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. దాంతో వేరే దారిలేక జగన్ శాశ్వత అధ్యక్ష పదవి తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు ఫైనల్ ఉత్తర్వుల్లో కమీషన్ స్పష్టంగా చెప్పింది. ఈ ఉత్తర్వులను పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పంపింది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నిక ద్వారా అయినా తీర్మానం ద్వారా అయినా జగన్ మాత్రమే అద్యక్షుడిగా ఉంటారని అందరికీ తెలుసు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం తీర్మానం ద్వారా అద్యక్షుడి నియామకం చెల్లదు. కచ్చితంగా రెండేళ్ళకో లేదా మూడేళ్ళకో కమీషన్ విధించిన కాలపరిమితి ప్రకారమే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సుంటుంది. కమీషన్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి.
పార్టీని రిజస్టర్ చేసేటపుడే, గుర్తింపు తెచ్చుకునేటప్పుడే కేంద్ర ఎన్నికల కమీషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటామని డిక్లరేషన్ ఇవ్వాల్సుంటుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు కమీషన్ భావిస్తే సదరు పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం కమీషన్ కు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే కమీషన్ ఉత్తర్వులకు స్పందించాలి. అంతర్గతంగా ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. జగన్ ఉన్నంతకాలం తానే అధ్యక్షుడిగా పార్టీ ఎన్నుకుంటే కమీషన్ కు ఎలాంటి అభ్యంతరాలుండవు. కాబట్టి మొండితనాన్ని పక్కనపెట్టేసి వెంటనే జరగాల్సింది చూస్తే మంచింది.
This post was last modified on September 22, 2022 11:26 am
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…