ఏపీ రాజకీయాల్లో తాజా వివాదంపై ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద భగ్గముంటున్న విషయం తెలిసిందే. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును మార్చేసి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది. అసెంబ్లీ, శాసనమండలిలో అధికారపార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు మెజారిటి కారణంగా ఆమోదం కూడా పొందేశాయి. దాంతో యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు స్ధానంలో డాక్టర్ వైఎస్సార్ పేరొచ్చేసింది. జగన్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలోను బయటా టీడీపీతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి.
సరే జగన్ తీసుకునే ప్రతీనిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతునే ఉంటాయి. ఏ ఒక్క నిర్ణయానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మద్దతివ్వలేదు. సరే ఏపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనుకుంటే ఇపుడు చెల్లెలు వైఎస్ షర్మిల కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటు నిలదీశారు. ఎన్టీయార్ పేరును తీసేయటం వల్ల దానికున్న పవిత్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం మారినపుడల్లా అప్పటికే ఉన్న పేర్లను తీసేసి కొత్తపేర్లు పెడుతుపోతే జనాల్లో అయమోయం వచ్చేస్తుందన్నారు. 1998 నుండి హెల్త్ యూనివర్సిటికి ఉన్న ఎన్టీయార్ పేరును తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం సరిగా వివరించలేకపోయిందని షర్మిలన్నారు. అంటే అసెంబ్లీలో జగన్ చెప్పిన కారణంతో షర్మిల ఏకీభవించటంలేదని అర్ధమవుతోంది.
నిజానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ తీసి వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల పార్టీకైనా ప్రభుత్వానికైనా వచ్చే లాభం ఏమీలేదు. పైగా పేరు తీసేయటం వల్ల ఎంతోకొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అధికారభాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. నిజానికి వీళ్ళిద్దరిదీ కమ్మ సామాజికవర్గమే అయినా జగన్ కు ఎంతో సన్నిహితులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళే జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాబట్టి అదునుచూసి షర్మిల కూడా జగన్ పై బండ వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on September 22, 2022 4:33 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…