ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైందో లేదో.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి ఇబ్బందులు తప్పట్లేదు. తాజాగా చిలకలూరి పేటలో అధికార పార్టీ కీలక నేతల మధ్య విభేదాలతో రాజకీయం రాజుకుంది. ఆ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రజనీ గురించి అందరికీ తెలిసిందే. ఆమె వైకాపా స్టార్ ఎమ్మెల్యేల్లో ఒకరు. ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సంచలనం సృష్టించారు రజనీ.
ఇక అక్కడ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట వైసీపీలో సీనియర్ లీడర్. 2004లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడాయన. ఎన్నికల ముందు టికెట్ కోసం వీరి మధ్య యుద్దం జరిగింది, అందులో రజనీనే గెలిచారు. ఐతే ఇప్పుడు మరోసారి వారి మధ్య కయ్యం మొదలైంది. ఎన్నికల తర్వాత రజనీ తనదైన పబ్లిసిటీ హడావుడితో వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.
ఐతే ఎమ్మెల్యేగా లేకపోయినా రాజశేఖర్‌కు ఫాలోయింగ్ ఏమీ తక్కువ కాదు. ఇప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఏ సమాచారమైనా మొదట రాజశేఖర్‌కే అందుతుందట. నియోజకవర్గంలో సీనియర్లతో ఆయన నిత్యం టచ్‌లో వుంటారట. నేతలు ఎవరైనా ముందుగా మర్రిని కలుసుకున్న తర్వాతే, రజనీని కలుస్తారట. ఇది రజనీకి నచ్చట్లేదని సమాచారం. మర్రి వర్గీయులన్న ముద్ర ఉన్నవారిని తన కార్యాలయంలోకి రావద్దని కూడా రజనీ నిర్మొహమాటంగా చెప్పేశారట. దీంతో మర్రి వర్గీయులు వేరు కుంపటి పెట్టుకున్నారు. వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున పెట్టిన ఫ్లెక్సీల్లో రజనీకి వాళ్లు చోటివ్వట్లేదు. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడం వివాదాస్పదమైంది.
రజనీ ఒత్తిడి మేరకు తొలగిస్తున్నారంటూ మర్రి వర్గీయులు ఏకంగా మున్సిపల్ ఆఫీస్ ముందు గతంలో ఆందోళనకు దిగారు. పదవి లేకపోవటం వల్లనే, మర్రి రాజశేఖర్‌కు తగిన గౌరవం దక్కటం లేదన్నది ఆయనతో పాటుగా ఆయన వర్గీయుల ఆవేదన. ఈ నేపథ్యంలో మర్రికి ఎమ్మెల్సీ పదవి దక్కబోతోందని.. దీంతో రజనీకి చెక్ పడినట్లే అని ఓ ప్రచారం నడుస్తోంది. ఇది రజనీ వర్గానికి మింగుడు పడటం లేదని అంటున్నారు. ఏదేమైనా చిలకలూరి పేటలో అంతర్గత పోరు వైకాపాకు తలనొప్పిగా మారేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
This post was last modified on July 7, 2020 12:32 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…