మాటకు మాట.. తూటాకు తూటా..! ఇదీ…కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి తెలంగాణ లోని ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకాచౌదరి శైలి. ఇక, ఈ ఫైర్ బ్రాండ్‌కు..మరో ఫైర్ బ్రాండ్ తగిలితే.. ఆ రాజకీయమే డిఫరెంట్‌గా ఉంటుంది!! ఇదే ఇప్పుడు.. ఏపీలో కనిపిస్తోంది. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్లకు మధ్య రాజకీయ ఫైట్ ప్రారంభమైంది. రేణుక.. కార్పొరేటర్‌గా కూడా గెలవలేదుఅని నాని.. వ్యాఖ్యానిస్తే..
నువ్వు లారీలు కడుక్కునే సమయానికే నేను కార్పొరేటర్ అయ్యా“ అని రేణుక నిప్పులు చెరిగారు.
దీంతో వీరిమధ్య మాటల యుద్ధం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి రేణుక.. తెలంగాణకు చెందిన నాయకురాలు. అదేసమయంలో నాని.. ఏపీ నాయకుడు. పైగా ఇద్దరికి ఎక్కడా సాపత్యం లేదు. అంటే.. ఇద్దరివీ చెరోదారులు. ఆమె కాంగ్రెస్.. ఈయన గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ. అయినా.. కూడా ఇద్దరి మధ్యమాటల తూటాలు పేలాయి. దీనికి కారణం.. ఆది నుంచి కూడా నాని.. అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. కానీ, రేణుక మాత్రం.. ఇక్కడ రైతులకు సానుభూతి చూపిస్తున్నారు.
ఇటీవల అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. స్వయంగా రథం నడిపి.. ఉత్సాహపరిచారు. అయితే.. రేణుక చౌదరి అమరావతి పాదయాత్రలో పాల్గొనడాన్ని గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. అసెంబ్లీలో ఆమెపై విమర్శలు చేశారు. ఖమ్మంలో ఇకపై కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుక చౌదరికి ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లే పాదయాత్ర పేరుతో రోడ్డెక్కారని విమర్శించారు.
ఈ విమర్శలపై తాజాగా రేణుక చౌదరి స్పందించారు. ఈ విమర్శలను ఆమె అంతేఘాటుగా తిప్పికొట్టారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొడాలి నానిని బుజ్జీ అని సంబోధించారు. కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే నేను కార్పొరేటర్‌గా ఎన్నికయ్యా
అని నిప్పులు చెరిగారు. అంతేకాదు.. కొడాలికి తన చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే- తానేమిటో తెలుస్తుందని అన్నారు. ఏపీ అసెంబ్లీలో తన పేరును ప్రస్తావించినందుకు రేణుకా చౌదరి థ్యాంక్స్ చెప్పారు. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే.. అంటూ చురకలు అంటించారు.
ఏపీ అసెంబ్లీలో తన పేరును తీసుకుని రావడం ద్వారా మంచి పబ్లిసిటీ ఇచ్చాడని రేణుకా చౌదరి చెప్పారు. పబ్లిసిటీ రావాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, అలాంటిది.. కొడాలి నాని వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని, అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటే టీడీపీకి సపోర్ట్ చేసినట్టేనా అని ప్రశ్నించారామె. ఖమ్మంలోనే గెలవలేనంటూ కొడాలి నాని సవాల్ చేశారని, అందుకే తాను ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని తేల్చేశారు.
గుడివాడ నుంచే పోటీ చేస్తా..
కాంగ్రెస్ అభ్యర్థిగానే గుడివాడ నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తానని, తెలుగుదేశం పార్టీ మద్దతు తనకు అవసరం లేదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తన కేరీర్‌లో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఇప్పుడా కొరతను గుడివాడతో తీర్చుకుంటాననీ చెప్పారు. కార్పొరేటర్, ఎంపీ, కేంద్ర మంత్రిగా పని చేశానే తప్ప ఎమ్మెల్యేగా లేనని అన్నారు. గుడివాడలో తాను గెలిచి చూపిస్తానని, ఆ తరువాత కొడాలి నానిని మళ్లీ ఓటర్లు ఎన్నుకోరని చెప్పారు. ఖమ్మం ఎంపీగా తాను అత్యధిక సార్లు గెలిచానని గుర్తు చేశారు. కొడా లి నాని వచ్చి ఖమ్మం జిల్లా గల్లీల్లో తిరిగి చూస్తే తానేంటో, తన శక్తి సామర్థ్యాలేమిటో తెలుస్తాయని సవాల్ రువ్వారు లేడీ ఫైర్ బ్రాండ్.
This post was last modified on September 20, 2022 2:21 pm
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…