కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో హాజరైన హోంశాఖ మంత్రి అమిత్ షా నేతలపై బాగా సీరియస్ అయినట్లు సమాచారం. విమోచన దినోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేకించి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు విషయంపైనే జరిగింది. ఈ సమావేశంలో నేతల తీరుపై బాగా మండిపడినట్లు సమాచారం.
కారణం ఏమిటంటే మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం లేకపోవటమే. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి లాక్కునే ఉద్దేశ్యంతో ఆయనతో రాజీనామ చేయించారు. తర్వాత బీజేపీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటించారు. అప్పట్లో కమలనాదుల ఉద్దేశ్యం ఏమిటంటే ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించటం, నామినేషన్ వేయటమే ఆలస్యం రాజగోపాలరెడ్డి గెలిచినట్లే అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ చూస్తుంటే మాజీ ఎంఎల్ఏ గెలుపు అనుమానమే అని తేలిందట.
దీనికి కారణం ఏమిటంటే రాజగోపాలరెడ్డితో పాటు ఆయన క్యాడర్లో చాలామంది కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. బీజేపీలో తానుచేరితే తన క్యాడర్ మొత్తం బీజేపీలోకి వచ్చేస్తుందని కోమటిరెడ్డి అమిత్ షా కు చెప్పారట. తీరాచూస్తే ఎవరో కొంతమంది తప్ప మిగిలిన నేతలంతా బీజేపీలో చేరేదిలేదని చెప్పేశారట. ఎంత ప్రయత్నిస్తున్నా నేతలుమాత్రం కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని చెబుతున్నారట. దాంతో ఏమిచేయాలో మాజీఎంఎల్ఏకి అర్ధం కావటంలేదు. ఉపఎన్నికలో త్రిముఖపోటీ జరిగితే బీజేపీ అభ్యర్ధి గెలుపు అనుమానమే.
డైరెక్టుగా టీఆర్ఎస్-బీజేపీ ఫైట్ జరిగితే కాంగ్రెస్ ఓట్ల సాయంతో బీజేపీ గెలిచే అవకాశముంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఇలాగే గెలిచింది. త్రిముఖ పోటీ ఎక్కడ జరిగినా బీజేపీ ఓడిపోవటమే. సో ఇపుడు మునుగోడులో కూడా బీజేపీ గెలుపు అనుమానంగా మారింది. ఈ విషయంలోనే వలసలను ప్రోత్సహించటంలో బీజేపీ నేతలంతా ఫెయిలయ్యారని అమిత్ మండిపడ్డారట. కేవలం వలసలను ప్రోత్సహించటం కోసం ప్రతి గ్రామంలోను త్రిసభ కమిటీలను వేయమని ఆదేశించారట. షెడ్యూల్ వచ్చేలోగా ఇతరపార్టీల నేతలను బీజేపీలోకి చేర్చాల్సిందే అని చెప్పారు. మరి బీజేపీకి సాద్యమేనా ?
This post was last modified on September 18, 2022 11:24 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…