రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని.. కొవిడ్ లాంటి మహమ్మారి వచ్చి సవాళ్లు విసిరినా ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు.. ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై విమర్శల రాళ్లు రువ్వారు. ఇదే నిజం అనుకుందాం. కానీ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగు సంస్థ క్రిసిల్ ఆగస్టులో పేర్కొంది. అమరావతి బాండ్ల రేటింగును ప్రతికూలంగా పేర్కొంది.
రిజర్వుబ్యాంకు కల్పించిన ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటుతోనే రాష్ట్రం నడుస్తోందని.. క్రిసిల్ స్పష్టంగా పేర్కొంది. మరి రాష్ట్ర ఆర్థికం అంత చక్కగా ఉంటే వేల కోట్ల బిల్లులు ఎందుకు పెండింగులో ఉన్నట్లు? ఈ బిల్లుల కోసం గుత్తేదారులు, సరఫరాదారు లు న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తున్నట్లు? పింఛనర్లకు ఎప్పుడో ఇవ్వాల్సిన కరవు భత్యం బకాయిలు ఎందుకు సకాలంలో ఇవ్వట్లేదు?
ఆర్థికవ్యవస్థ బాగుండి, బిల్లులు సరిగానే చెల్లిస్తే.. గుత్తేదారులు టెండర్లంటేనే ఎందుకు భయపడుతున్నా రు? శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం కోటి బిల్లు ఇంతవరకు ఎందుకు చెల్లించలేదు? ఉద్యోగులు దాచుకున్న సొమ్ముల నుంచి రుణాలు తీసుకోవడానికి దరఖాస్తు చేస్తే నెలల తరబడి ఎందుకు పెండింగులో ఉంచు తున్నారు? ఆర్థిక పరిస్థితి అంత బాగుంటే ప్రతినెలా 8 వేల కోట్లు, 9 వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలు ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు లక్షా 20 వేల 556 కోట్ల రూపాయలని.. 2019 మే నెల నాటికి ఉన్న అప్పు 2 లక్షల 69 వేల 462 కోట్లు అని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రుణం 3 లక్షల 82వేల 165 కోట్లు అని ఇవన్నీ కాగ్ నివేదికలోనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని 29 కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు లక్షా 15 వేల 403.58 కోట్లు. ఇవికాక ఏపీఎస్‌డీసీ ద్వారా తీసుకున్న రుణం 23 వేల 200 కోట్ల రూపాయలు. ఇవి కలిస్తే లక్షా 38 వేల 603 కోట్లు. నాన్ గ్యారంటీ రుణాలు 87 వేల 233 కోట్లు. అవి కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా 8 వేల 300 కోట్లు రుణం తీసుకున్నారు. ఏపీఎస్‌డీసీ రుణం, బెవరేజస్ కార్పొరేషన్ రుణం కూడా ప్రభుత్వ అప్పులేనని కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే బహిరంగ మార్కెట్ ద్వారా సుమారు 40వేల కోట్లు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి ద్రవ్యలోటు, జీడీపీలో రుణాల రేటు, అప్పులు మొత్తం పెరిగిన శాతాన్ని కూడా గతంతో, ఇతర రాష్ట్రాలతో పోల్చి చెప్పారు. అసలు అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ఇక వాటి ఆధారంగా చేసే విశ్లేషణలు ఎలా సరైనవవుతాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ల అప్పులు ఏవీ మొత్తం అప్పుల్లో కలపలేదు. ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చితే అందులోని వాస్తవాలు ఎలా తేలుతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on September 17, 2022 9:57 pm
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…