ఏపీ మంత్రి వర్గాన్ని త్వరలోనే.. విస్తరించనున్నారా.. మంత్రులు ఈ విషయంలో గుంభనంగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో లాబీల్లో కొందరు నాయకులు.. ముచ్చట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాజాగా మరో సంచలన విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
త్వరలోనే.. మంత్రి వర్గాన్ని విస్తరించే ప్రణాళికలు చేస్తున్నారనేది.. వైసీపీ ఎమ్మెల్యేల ముచ్చట్ల మధ్య తెలిసిన విషయం. అయితే.. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు.. ఎందుకు మారుస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. 2019లో వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత.. తొలిసారి మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. వీరిని ఇటీవల మార్చి ఏప్రిల్11న మరోసారి.. తన టీంను ఏర్పాటు చేసుకున్నారు జగన్.
నిజానికి.. ఈ రెండు కూడా జగన్ ఇప్పటి వరకు చెప్పినవే. అయితే.. ఇప్పుడు ప్రస్తుత మంత్రి వర్గంపై జగన్ అసంతృప్తితో ఉన్నారనేది.. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. కేవలం మంత్రుల వ్యవహారశైలిపైనే.. ఆయన ఇటీవల.. పీకే టీంతో సర్వేలు చేయించారని.. ఈ సర్వేల్లో సంచలన వాస్తవాలు వెలుగు చూశాయని అంటున్నారు. కొందరు మంత్రులు.. అంటే.. ఐదారుగురు మాత్రమే పనులు చేస్తున్నారని.. గటట్టి వాయిస్ వినిపిస్తున్నారని.. మిగిలిన వారు.. యథాలాపంగా.. నామ్ కే వాస్తే.. అన్నట్టుగా ఉన్నారని.. స్పష్టమైందట.
ఇదిలావుంటే.. కొన్నాళ్ల కిందట.. జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ.. జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు బయటకు రావడం లేదని.. కనీసం మాట్లాడడం లేదని.. ఆయన వాపోయారు. ఈ క్రమంలో ‘మార్చేస్తా’ అని కూడా ఆయన హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే.. ఇప్పుడు.. ఇదే విషయం పై ఎమ్మెల్యేలు.. లాబీల్లో మాట్లాడుకోవడం.. గమనార్హం. మంత్రి వర్గాన్ని మార్చేయడం ఖాయమని అంటున్నారు. తాజా మంత్రివర్గం మార్పు జరిగితే.. మళ్లీ కొడాలి నాని, పేర్నినాని.. వంటివారికి ప్రాధాన్యం దక్కుతుందని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. మార్పు జరిగితే కనుక.. దసరా ముందే జరుగుతుందని గుసగుసలాడడం గమనార్హం.
This post was last modified on September 15, 2022 9:51 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…