తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది తర్వాత వైఎస్ షర్మిలకు అధికారికంగా గుర్తింపు లభించినట్లయ్యింది. ఇపుడు వచ్చిన గుర్తింపు ఏమిటాని ఆశ్చర్యపోతున్నారు. షర్మిలపై ఆరుగురు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకునే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంత్రుల ఫిర్యాదు, స్పీకర్ హామీ, సభా హక్కుల ఉల్లంఘన కమిటీ పరిశీలనకు సదరు ఫిర్యాదును పంపటంతో ఇపుడు షర్మిల మీద చర్యల విషయమే హాట్ టాపిక్ అయిపోయింది.
ఇక్కడ విషయం ఏమిటంటే ఇంతకాలం తెలంగాణలో వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా మిగిలిన పార్టీలేవీ గుర్తించలేదు. షర్మిల పాదయాత్ర చేస్తున్నా, ఉద్యోగాల భర్తీ డిమాండుతో వారంలో ఒక్కరోజు దీక్షలు చేస్తున్నా ఏ పార్టీ కూడా షర్మిలను అసలు గుర్తించటానికే ఇష్టపడటంలేదు. ఇలాంటి నేపధ్యంలోనే కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగులో మొదటిసారి షర్మిల పార్టీకి ఆహ్వానం అందింది.
తర్వాత మరే పార్టీ నుంచి కూడా వైఎస్సార్టీపికి ఆహ్వానాలు అందలేదు. అలాంటిది ఇపుడు మంత్రులు ఆమెపై ఫిర్యాదు చేశారంటేనే వైఎస్సార్టీపీని మంత్రులు గుర్తిస్తున్నట్లే కదా ? షర్మిలపై మంత్రులు చేసిన ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేరే విషయం. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డిదే తప్పంతా. షర్మిలను పట్టుకుని మంత్రి ఎగతాళిగా మాట్లాడుతు మంగళవారం మరదలు అని కామెంట్ చేశారు. దాంతో షర్మిల మంత్రిపై రెచ్చిపోయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం కాస్త బాగా పెద్దదైపోయింది.
ఆ తర్వాత మరికొందరు మంత్రులపైన కూడా షర్మిల అవినీతి ఆరోపణలు చేయటమే కాకుండా రెగ్యులర్ గా కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మంత్రులపై షర్మిల చేసిన ఆరోపణల్లాంటివే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా చేస్తున్నారు. వాళ్ళెవరికీ సభా హక్కుల నోటీసులు ఇవ్వాలని మంత్రులకు అనిపించలేదు. సో ఏదేమైనా షర్మిలకు ఒక్కసారిగా తెలంగాణాలో బాగా గుర్తింపు వచ్చేసిందనే అనుకోవాలి.
This post was last modified on September 15, 2022 11:44 am
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…