పొలిటికల్‌గా ఎంత దూకుడు పెంచినా.. ఏం చేసినా.. కోరుకున్న యోగం కోసమే కదా! నాయకుల వ్యవహా రం ఎప్పుడూ కూడా.. ఏదో ఒకటి ఆశించే ఉంటుంది. అలానే.. గతంలో వైఎస్ ఆశీర్వాదంతో(తెరచాటున) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అన్నగారి కుమార్తె.. దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రాగానే.. ఆమె విశాఖ నుంచి గెలుపు గుర్రం ఎక్కడం.. ఆవెంటనే అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చక్రం తిప్పడం తెలిసిందే.
కట్ చేస్తే.. రాష్ట్ర విభజన ముప్పు ప్రజలకు ఎలా ఉందో తెలియదు కానీ.. రాజకీయ నేతలపై మాత్రం బాగా నే పడింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పురందేశ్వరి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. గత ఎన్నికల్లోనూ ఇదే పరాభవం ఎదురొచ్చింది. దీంతో పురందేశ్వరి.. మౌనంగానే ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న నాయకులతో చెలిమిలేదనే మాట వాస్తవం.
మొత్తంగా అనేక ఎదురు చూపుల తర్వాత.. బీజేపీ కొంత మేరకు గుర్తించింది. ఈ క్రమంలోనే కేంద్ర పార్టీ లో పదవులు కట్టబెట్టింది. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపి పరిశీలక ఇంచార్జ్ గా నియమించారు. అదేవిధంగా పార్టీలో చేరికల కమిటీలో పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. ఇవి నిజంగానే కీలక పదవులు. అయితే.. ఏం జరిగిందో ఏమో.. తెలియదు కానీ.. పార్టీ అధిష్టానం.. ఇటీవల ఒరిస్సా,ఛత్తీస్‌గఢ్ పదవుల నుంచి పురందేశ్వరిని తప్పించింది. దీంతో ఖంగుతిన్న పురందేశ్వరి.. కొన్నాళ్లపాటు మీడియాకు ముఖం చాటేశారు.
ఇక, ప్రస్తుతం ఆమె..కేవలం.. చేరికల కమిటీ బాధ్యురాలిగా మాత్రమే ఉన్నారు. ఇదిలావుంటే… వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని.. గెలిచి.. కేంద్రంలో మంత్రిపీఠాన్ని దక్కించుకోవాలనేది.. పురందేశ్వరి ఆకాంక్ష. అయితే.. ఆమెకోరుకున్నట్టుగా.. విశాఖ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోం ది. ఇక్కడ నుంచి ఒక కీలక నేత టికెట్ ఆశిస్తున్నారు. గతంలో కూడా ప్రయత్నించినా.. ఆయనకు సాకారం కాకపోవడంతో ఇప్పుడు మాత్రం గట్టిగానే టికెట్ కోసం.. ఓ కీలక నాయకుడితో సిఫారసు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో చిన్నమ్మకు ఆశలు నెరవేరే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. సీటే దక్కకపోతే.. ఆమె గెలిచేదెలా.. ఇక, మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేదెలా? అని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 14, 2022 3:08 pm
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…