కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వర లోనే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తానని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట ఆయన భారత రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్) పేరుతో జాతీయ పార్టీ కూడా పెడుతున్నట్టు.. టీఆర్ ఎస్ వర్గాలు మీడి యాకు క్లూలు ఇచ్చాయి. దీంతో ఇంకేముంది.. కేసీఆర్ .. జాతీయ పార్టీ పెట్టడం ఖాయమనే చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. ఇప్పుడు పరిణామాలు అందకు అనుకూలంగా కనిపించడం లేదు.
ప్రస్తతం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను గమనిస్తే.. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం లేదన్నది రాజకీయ వర్గాల అంచనా. అంటే.. నిజానికి జాతీయ పార్టీ కనుక స్థాపిస్తే.. పార్లమెంటులోను ఇటు కనీసం మూడు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ.. అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉండాలి. అదేసమయంలో 6 శాతం ఓటు బ్యాంకు కూడా సొంతం చేసుకోవాలి. అయితే.. ఇప్పుడు కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగంతో చర్చలు జరుపుతున్నారు. అదేసమయంలో ప్రాంతీయ పార్టీలతోనూ చర్చలు చేస్తున్నారు. తాను కేంద్రంపై యుద్ధం ప్రకటించానని కలిసి రావాలని చెబుతున్నారు. దీనికి జేడీఎస్(కర్ణాటక ప్రాంతీయ పార్టీ), ఆప్(ఢిల్లీ సహా పంజాబ్ అధికార పార్టీ), జేడీయూ(బీహార్ అధికార పార్టీ) వంటి ఓకే అన్నాయి. దీనిని బట్టి.. కూటమి ఏర్పాటు చేసే దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారనేది విశ్లేషకుల భావన.
అదేజాతీయ పార్టీ కనుక పెట్టాలంటే.. కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో బీఆర్ ఎస్(స్థాపిస్తే) పోటీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటుందా? అనేది ప్రశ్న. ఉండకపోతే..(ఉండే అవకాశం లేదు) ఒంటరిగానే కేసీఆర్ పోటీ చేయాలి. ఇదే జరిగితే.. అక్కడ ఇప్పుడు కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్న పార్టీలకు బీఆర్ఎస్ పోటీ ఇస్తుంది. దీనివల్ల అంతో ఇంతో ఓటుబ్యాంకు నష్టం ఆయా పార్టీలు ఎదుర్కొంటాయి. దీనికి ఆయా పార్టీలు అంగీకరించే ప్రశ్నే లేదు.
ఈ పరిణామాల క్రమంలో కేసీఆర్.. ఇప్పటికిప్పుడు.. జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం లేదనేది రాజకీయ వర్గాల భావన. ప్రస్తుతం కేసీఆర్ లక్ష్యం కేంద్రంలోని మోడీని గద్దెదింపడమే. దీనికిగాను.. ఆయన ప్రాంతీయ పార్టీలను ఏకం ఏయడమే. ఇదే జరిగితే..ఆయన జాతీయ పార్టీ పుట్టుక అనేది ఉంటుందా? అనేది ప్రశ్న. జాతీయ పార్టీ పెట్టడానికి ఇబ్బందిలేదు..కానీ.. ఇది పెడితే.. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి కేసీఆర్ వ్యతిరేకతను ఎదుర్కొనాలి. సో.. ఎలా చూసుకున్నా కేసీఆర్ వ్యూహం వేరేగా ఉందనేది స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 14, 2022 9:14 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…