Political News

మూడు ముచ్చ‌ట ఇక లేన‌ట్టే.. మంత్రి మాటల్లో చెప్పేశారుగా…!

మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట లేన‌ట్టేనా? ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌నా కాలంలో మూడు రాజ‌ధానులు పూర్తి అయ్యే ప‌రిస్థితి లేదా? అంటే..తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చేసిన వ్యాఖ్య‌లను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి.. ఏపీ ప్ర‌భుత్వం 2020 నుంచి కూడా మూడు రాజ‌ధానుల ఊసు ఎత్తుకొచ్చింది. అసెంబ్లీ వేదిక‌గానే మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న చేసిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని కేవలం శాస‌న రాజ‌ధానిగానే ఉంచుతామ‌న్నారు.

ఇక‌, దీనిపై న్యాయ వివాదాలు ముసురుకున్నాయి. రైతులు ఉద్య‌మం చేశారు. పాద‌యాత్ర చేశారు.. ప్ర‌స్తుతం కూడా చేస్తున్నారు. అయితే.. ఇంత జ‌రిగినా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం తాను మూడు నుంచి వెన‌క్కి త‌గ్గే దేలేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల హైకోర్టు అమ‌రావతినే రాజ‌ధాని చేయాల‌ని.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసి తీరాల‌ని కూడా స్ప‌ష్టం చేసిం ది. దీనికి మూడు మాసాల స‌మ‌యం ఇచ్చింది. అయితే.. ఇది దాటిపోయింది.

అయినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌నే చెప్పుకొచ్చారు. ఇక‌, రేపోమాపో.. సీఎం జ‌గ‌న్‌.. విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభిస్తార‌ని కూడా కొంద‌రు నాయ‌కులు క్లూ ఇస్తున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌… జ‌గ‌న్ హ‌యాంలో ఈ రెండేళ్ల కాలంలోనే జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తాజాగా మంత్రి గుడివాడ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడురాజ‌ధానుల అంశ‌మే ప్ర‌ధాన అజెండా అవుతుంద‌ని తెలిపారు.

తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ స‌ర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు తోడు.. మూడు రాజ‌ధానుల అంశాన్ని కూడా అజెండాలో పెడ‌తామ‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తామ‌ని చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా మూడు రాజ‌ధానుల విష‌యంలో ఎలాంటి అడుగు ప‌డ‌బోద‌ని.. స్ప‌ష్టంగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి..అప్పుడు మ‌రోసారి గెలిచి.. ఆ త‌ర్వాత‌.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రాకుండా త‌మ‌పంతం నెగ్గించుకోవాల‌ని..వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఇదీ సంగ‌తి!

This post was last modified on September 14, 2022 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

15 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago