టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల పొట్ట నింపేందుకు తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లపై.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ క్యాంటీన్లను తొలగిస్తున్నారు. వీటిని నిర్వహిస్తున్న టీడీపీ నాయకులపై భారీ ఎత్తున కేసులు కూడా నమోదు చేశారు. ఇక, భోజనం చేస్తున్న వృద్ధులు, పెద్దలపైనా లాఠీలతో విరుచుకుపడిన సంఘటనలు అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం.. ఎన్నికల్లో ఈ అన్నాక్యాంటీన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే.
సాక్షాత్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నాక్యాంటన్ కూడా పోలీసులు కూల్చేశారని.. టీడీపీ నేతలు ధర్నా చేసిన విషయం కలకలం రేపింది. చంద్రబాబు ఇటీవల కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్‌ను ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే..రాత్రికిరాత్రికి.. ఇక్కడ వైసీపీ నాయకులు హంగామా సృష్టించి.. కూల్చేశారు. ఇలా.. ప్రభుత్వం నుంచి.. వైసీపీ నాయకుల నుంచి కూడా అన్నా క్యాంటీన్లపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
అయితే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని కేసులు పెట్టుకున్నా.. చంద్రబాబు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని.. తాజాగా ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఖర్చులకు కూడా ఎవరూ ఆలోచించవద్దని దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతల ఇళ్లలో జరిగే శుభకార్యాలు ఇక్కడే చేసుకుని.. ఆ సొమ్ములో కొంత భాగం అన్న క్యాంటీన్ నిర్వహణకు వెచ్చించాలని సూచించారు.
అదేవిధంగా పార్టీ పరంగా కూడా కొంత మొత్తం ఇస్తామన్నారు. ఇక,.. కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని.. అన్న క్యాంటీన్ నిర్వహణ చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో తగ్గేదేలే.. అనే సంకేతాన్ని స్పష్టంగా చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలు చూస్తే… వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న అన్నక్యాంటీన్లపై చంద్రబాబు జగమొండిగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోందని తెలుస్తోంది. మరి ఈ పరిణామాలపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 13, 2022 11:01 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…