టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు… ఎన్టీఆర్ నడయాడిన నియోజకవర్గం .. ఆయనే స్వయంగా విజయం సాధించిన నియోజకవర్గం.. అలాంటి నియోజకవర్గంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ చిన్నబోతోంది! వరుస పరాజయాలు మూటగట్టుకుని.. అవమాన భారాన్ని భరిస్తోంది. మరి దీనికి కారణం ఏంటి? నిజంగానే ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తున్నారా? లేక.. టీడీపీలోని కొందరు కోవర్టులే.. పార్టీకి అశనిపాతంగా మారి.. ఓడిపోయేలా చేసి.. అవమానాన్ని తలకెత్తుతున్నారా? ఇదీ.. ఇప్పుడు చర్చ!
ఎందుకు ఈ చర్చ ఇప్పుడు తెరమీదికి వచ్చిందంటే.. తాజాగా మాజీ మంత్రి.. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ.. రాటుదేలిన కొడాలి నాని.. టీడీపీ మహిళా నేతలపై నోరు పారేసుకున్నారనే కారణంగా.. తమ్ము ళ్లు ఒక్కసారిగా విజృంభించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని.. మహిళలకు నాని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా నాయకులు ఏకమయ్యారు. ఇది మంచి పరిణామమే. కానీ, ఇప్పటి వరకు ఏం జరిగింది? అసలు ఎన్నికల సమయానికి ఏం జరుగుతోంది? అనేదే ప్రశ్న.
ఈ కలివిడి.. కేవలం ఎన్నికల వరకు మాత్రమేననేది విశ్లేషకులు చెబుతున్న గట్టి మాట. ఎన్నికల సమయం వచ్చే సరికి .. కొడాలి నానికి అనుంగులుగా, ఆయన చెప్పిందే వేదంగా.. ఆయన నుంచి తీసుకుంటున్న మూటలతో పబ్బం గడుపుకొంటున్న నాయకులు లెక్కకు మిక్కిలి ఉన్నారని.. ప్రస్తుతం జరుగుతున్నదంగా.. అధినేత చంద్రబాబుకు కంటితుడుపు చర్యలేనని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఏం జరిగిందో చాలా మంది వివరిస్తున్నారు.
గత 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ను ఇక్కడ నిలబెట్టారు. నిజానికి అప్పటికే మూడు సార్లు విజయంతో ఉన్న కొడాలి నాని.. పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీంతో అవినాష్ గెలుపు నల్లేరుపై నడక లాంటిదే. అయితే.. ఈ క్రమంలో నాని విసిరిన పాచిక.. టీడీపీకి భారీగా తగిలింది. ఎన్నికలకు రెండు రోజుల ముందు కీలక నేతలు.. నానితో చేతులు కలిపారనేది.. నిష్టుర సత్యం. పార్టీ తరఫున.. డబ్బులు ఇచ్చినా.. ఖర్చు చేయడం మానేసి.. వారి జేబుల్లో వేసుకున్నారు.
అంతేకాదు.. తనను గెలిపించాలంటూ.. నాని ఇచ్చిన సొమ్ములు తీసుకుని.. అవినాష్‌కు వ్యతిరేకంగా.. ఆయన లోకల్ కాదు.. అనే నినాదాన్ని తెరచాటున ప్రచారం చేసింది కూడా టీడీపీ నేతలేననేది.. లోకల్ టాక్. ఫలితంగా గెలిచి తీరుతుందని.. భావించిన నియోజకవర్గంలో సైకిల్ చతికిల పడిపోయింది. ఇక, ఇప్పటికీ.. పార్టీనేతల్లో మార్పు లేకపోగా.. వచ్చే ఎన్నికల్లోనూ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారనేదే ఇప్పుడు వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఇప్పుడు విజృంభిస్తున్నారంటే.. అది కూడా నారా లోకేష్ బలవంతం మీదో.. లేక.. మొహమాటం మీదో అంటున్నారు పరిశీలకులు.
ఈ ధీమానే.. టీడీపీ నేతల్లో ఉన్న ఈ వీక్‌నెస్‌నే కొడాలి తనకు ఆయుధంగా మార్చుకున్నారు. తాను ఏం చేసినా.. తానేం మాట్లాడినా.. ఎన్నిక ల సమయానికి స్థానిక తమ్ముళ్లను తనకు అనుకూలంగా మార్చుకోగలననే ధైర్యమే.. ఆయనను ఇక్కడ బడా నాయకుడిని చేసిందనేది నిర్వివాదాంశం అంటున్నారు. మరి ఇప్పటికైనా.. ఈ కోవర్టులను ఏరేయకపోతే.. మళ్లీ మళ్లీ గుడివాడ గడపలో టీడీపీకి పడిగాపులు తప్పవనే అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 12, 2022 1:08 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…