మొత్తానికి కేసీయార్ కు ఒక పార్టీ మద్దతు ప్రకటించింది. ఆదివారం ప్రగతి భవన్లో కేసీయార్ ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీయార్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. కేసీయార్ లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఇపుడు చాలా అవసరముందన్నారు. దసరా పండుగ లోపలే తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు తనతో కేసీయార్ చెప్పారని కుమారస్వామి చెప్పారు.
సో కుమారస్వామి చెప్పినదాన్ని బట్టి చూస్తే కేసీయార్ కు జేడీఎస్ మద్దతు ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే జాతీయ రాజకీయాల్లో జేడీఎస్ బలమేంటి ? ఈ పార్టీకున్న స్ధాయి ఏమిటన్నది కీలకమైంది. ఎందుకంటే కర్నాటకలోనే జేడీఎస్ దెబ్బతినేసింది. తన పార్టీలోని ఎంఎల్ఏలను బీజేపీ లాగేసుకుంటే కుమారస్వామి ఆపలేక ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాల్లో జేడీఎస్ పాత్ర దాదాపు నిల్లనే చెప్పాలి.
ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది. అదేమిటంటే కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మిత్రపక్షాలు. రెండుపార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే బీజేపీ వ్యూహాల కారణంగా ప్రభుత్వం అర్ధాంతరంగా కూలిపోయింది. జాతీయ స్ధాయిలో కూడా కాంగ్రెస్ కు జేడీఎస్ మద్దతుగానే నిలబడుతోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ కు జేడీఎస్ మద్దతు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. ఒక వైపేమో కాంగ్రెస్ పార్టీని కేసీయార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకో సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడీఎస్ కేసీయార్ కు మద్దతు ప్రకటించింది.
మరి మద్దతు ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణాలో కేసీయార్ జేడీఎస్ కు సీట్లిస్తారా ? లేకపోతే జేడీఎస్సే కర్నాటకలో టీఆర్ఎస్ కు కొన్ని సీట్లు కేటాయిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. జాతీయపార్టీగా విస్తరించాలని అనుకుంటున్న కేసీయార్ ఇతర రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీలోకి దింపకపోతే ఉపయోగముండదు. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటారనేది సస్పెన్సుగా మారింది.
This post was last modified on September 12, 2022 12:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…