Political News

గుడివాడ గ‌రం గ‌రం.. మాజీ మంత్రి పెట్టిన మంట‌!

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అడ్డుడికిన‌ట్టు ఉడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప‌దుల సంఖ్య‌లో టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌హా.. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గుడివాడ ప‌ట్టణం ఒక్క‌సారిగా గ‌రంగరం అయిపోయింది. రెండు రోజుల కింద‌ట‌.. కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై నోరు పారేసుకున్నారు. అదేస‌మ‌యంలో ఆ పార్టీ మ‌హిళా నేత‌ల‌పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. డిమాండ్ చేశారు.

ఈ క్ర‌మంలోనే నాని ఇంటిని సైతం మ‌హిళా నేత‌లు చుట్టుముట్టారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో తాజాగా టీడీపీ నేత‌లు నాని పై ఫిర్యాదు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా గుడివాడ‌లో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. గుడివాడలోని టీడీపీ కార్యాలయం వద్దకు నేతలు బయల్దేరగా పలువురు నేత‌ల‌ను మార్గంమధ్యలో పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ వర్ల రామయ్య తదితరులను పోలీసులు పామర్రు వద్ద అడ్డుకున్నారు. అక్కడ్నుంచి వారిని గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్, పెడన పార్టీ ఇన్‌ఛార్జి కాగిత వెంకట ప్రసాద్‌లు ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించి గుడివాడ చేరుకున్నారు. అనంతరం గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. వారిని పోలీసులు టీడీపీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. బారికేడ్లు, రోప్‌ పార్టీని ఏర్పాటు చేసి అక్కడే ఫిర్యాదు స్వీకరిస్తామని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, బోడెప్రసాద్‌, జయమంగళ వెంకట రమణ, కాగిత వెంకట కృష్ణప్రసాద్‌లు పోలీస్‌ బందోబస్తు, బారికేడ్లను తోసే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. అనంతరం రోప్‌ పార్టీని, బారికేడ్లను తోసుకుని ముందుకెళ్తూ కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు పోలీస్‌స్టేషన్‌ చేరుకున్నారు. అప్పటికే వన్‌ టౌన్‌ పోలీసులు స్టేషన్‌ గేటు మూసివేశారు. ఈ చర్యపై ఆగ్రహించిన నాయకులు ఫిర్యాదు చేయడానికి వస్తే తాళాలు వేసుకోవడం ఏంటని ఆందోళనకు దిగారు.

ఈ క్ర‌మంలో గుంపులుగా స్టేషన్‌కు రావడం సరికాదని.. నలుగురు మాత్రమే వచ్చి ఫిర్యాదు అందజేయాలని పోలీసులు సూచించారు. దీంతో రావి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, బోడె ప్రసాద్‌, కాగిత వెంకట కృష్ణప్రసాద్‌లు స్టేషన్‌లోకి వెళ్లి మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని.. మహిళలపై గౌరవం లేకుండా చట్ట సభలు, మీడియా సమావేశాల్లో తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు.

This post was last modified on September 12, 2022 6:20 am

Share
Show comments
Published by
satya

Recent Posts

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

4 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

5 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

5 hours ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

6 hours ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

7 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

7 hours ago