Rahul Gandhi
ఎప్పుడూ గంభీరంగా ఉండే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో సిగ్గు మొగ్గలేసింది. అది కూడా అత్యంత కీలకమైన, సీరియస్ కార్యక్రమం భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలో ఆయన తెగ సిగ్గుపడిపోయారు. దీనికి కారణం.. ఈ యాత్ర సమయంలో అనూహ్యంగా రాహుల్ గాంధీకి పెళ్లి ప్రస్తావన రావడమే. అది కూడా మా అమ్మాయిని ఇస్తాం అంటూ.. తమిళనాడు మహిళ లు అనూహ్యమైన ఆఫర్ ఇవ్వడమే. దీంతో ఆయన బిడియంతో కూడిన సిగ్గుతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. ఉపాధి హామీ పథకాన్ని తమ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలోనే తీసుకువచ్చిన సంగతి తెలుసా? తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే… మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. “మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. మా అమ్మాయి.. మా తమిళనాడుకు చెందిన యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమంటారు? ఇష్టమైతే చెప్పండి.. మేం వచ్చి.. మీ అమ్మగారితో మాట్లాడతాం” అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. అయితే.. దీనికి రాహుల్ ఎలాంటి సమాధానం చెప్పేలేదు.
కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారట రాహుల్. అంతేకాదు.. ఆయన ముఖంలో బిడియంతో కూడిన సిగ్గు స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో వెల్లడించారు. మహిళలు పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, వారితో రాహుల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on September 11, 2022 9:49 pm
అడిగింతే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…