ఏపీలో వైసీపీ నేతల భజన పరాకాష్టకు చేరిందని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత జగన్‌ను, ఆయన తండ్రి.. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికి ఎత్తేయడం.. పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే.. ఎవరి పంథాలో వారు.. ఈ భజన విషయంలో మరింత దూకుడుగా ఉన్నార నేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఎందుకంటే.. మంత్రి పదవులు కాపాడుకోవాలనే కోరికో.. లేక.. అధినేతను మచ్చిక చేసుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావనే బెంగే తెలియదు కానీ.. నాయకులు పోటీ పడి మరీ.. అధినేతను మెచ్చిక చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లా వేమూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఇదే సమయంలో టీడీపీ నేతలు .. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించడంపై ఆయన మండి పడ్డారు. రాజా రెడ్డిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని.. అన్న మంత్రి.. ఆయన ఈ దేశానికి ఒక అద్భుతమైన సేవ చేశారని అన్నారు. దేశానికి ఆణిముత్యాల్లాంటి కుమారులను ఇచ్చారని.. చెప్పుకొచ్చారు.
దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి ఆణిముత్యం లాంటి నాయకుడని.. చెప్పిన నాగార్జున ప్రస్తుత సీఎం జగన్ కూడా ఆణిముత్యమేనని అన్నారు. అలాంటి రాజారెడ్డిని ఎందుకు ఆడిపోసుకుంటున్నారని ప్రతివిమర్శలు సంధించారు. అదేసమయంలో చంద్రబాబు ఈ దేశానికి, రాష్ట్రానికి ఏమిచ్చారని.. నిలదీశారు. పప్పు సుద్ద వంటి.. లోకేష్‌ను రాష్ట్రంపై రుద్దారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనించిన నెటిజన్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. రాజారెడ్డిపై.. పులివెందుల పోలీసు స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు.. జగన్ ఆణిముత్యమే అయితే.. 32 కేసులు ఎందుకు నమోదు చేశారు. సీబీఐ ఎందుకు ఆయనను అరెస్టు చేసింది? ఆయన ఎందుకు 16 మాసాలు జైల్లో ఉన్నారు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకపోవడాన్ని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆణిముత్యం ఇంకా.. బెయిల్‌పైనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం మంత్రి ఇంత హఠాత్తుగా పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబంపై ఇలా.. ప్రశంసల జల్లు కురిపించడం వెనుక.. తాజాగా సీఎం జగన్ ఇచ్చిన క్లాసే పనిచేసి ఉంటుందని అంటున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో తన కుటుంబంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మంత్రులుగా ఉన్న వారు ఎందుకు మౌనం వహిస్తున్నారని.. బాగానే క్లాస్ తీసుకున్నారు జగన్. బహుశ ఈ ఎఫెక్ట్‌తోనే నాగార్జున ఇలా రియాక్ట్ అయిఉంటారని అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on September 9, 2022 10:44 am
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…