తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎంపీలు ఎవరంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంటుస్ధానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ ఒకటేసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఏదో పెద్ద లెక్కే ఉన్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది.
ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు ఎలాగున్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టమే. ఎందుకంటే ఈమధ్యనే కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలతో ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీకి 80 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు. గట్టిగా కష్టపడితే మరో పదిసీట్లు అదనంగా రావటం ఖాయమని అంటే మొత్తం 90 సీట్లు వస్తాయని చెప్పారు.
కేసీయార్ చెప్పినదాంట్లో ఎంత నిజముందో సీఎంకే తెలియాలి. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో చూస్తే కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జనాభిప్రాయానికి కేసీయార్ మాటలకు లింకు కుదరటంలేదు. ఇక బీజేపీ విషయం చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒకటే ఊదరగొడుతున్నారు. బండి మాటలమీద కూడా పెద్ద నమ్మకం కలగటంలేదు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం.
వాస్తవం ఇలాగుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మాదేనంటే ఎలా నమ్ముతారు ? బీజేపీకి అంత సీన్ లేదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రావటం ఖాయమని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే పై ముగ్గురు ఎంపీలు అసెంబ్లీకి పోటీచేయాలని అనుకుంటున్నారట. బహుశా రేవంత్ కొడంగల్ లేదా కల్వకుర్తి, ఉత్తమ్ హుజూర్ నగర్, అప్పటివరకు పార్టీలోనే ఉంటే వెంకటరెడ్డి నల్గొండ నుండి పోటీచేస్తారని అనుకుంటున్నారు.
This post was last modified on September 8, 2022 2:23 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…