Political News

చంద్రబాబు నిజంగా ఆ మాట అన్నారా?

మన గొప్పదనాన్ని మనం చెప్పడం కన్నా ఇతరులు చెబితే బాగుంటుంది. మనం నిజంగా ఎంత గొప్ప పని చేసినా.. నేను ఇంత చేశా అంతా చేశా అని చెప్పుకుంటే దాని విలువ తగ్గిపోతుంది. అదే విషయం వేరే వాళ్ల నోటి నుంచి వస్తే దాని విలువ రెట్టింపవుతుంది. ఈ చిన్న లాజిక్ మిస్సయి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య బాగా అన్‌పాపులర్ అయ్యారు. అంతా నేనే చేశా అని చెప్పుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో ఆయన మరీ హద్దులు దాటిపోతుంటారు.

హైదరాబాద్‌లో ఒకప్పుడు ఆయన అభివృద్ధికి బాటలు పరిచిన మాట వాస్తవం. దాని వల్ల ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగిన మాటా నిజమే. కానీ దానికి ముడిపెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా క్రెడిట్ నాదే అని ముందుకు వచ్చేస్తుంటారు చంద్రబాబు. సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి మంచి కంటే చెడే చేస్తాయి. ఇలాంటి వ్యాఖ్యల్ని కామెడీ చేసి బాబును అన్‌పాపులర్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

ఐతే చంద్రబాబుకున్న ఈ అలవాటును తమకు అనుకూలంగా మలుచుకుని లేని విషయాల్ని కూడా కల్పించి బాబును బద్నాం చేయడం ఎక్కువైపోయింది ఈ మధ్య. తాజాగా ఆయన గురించి మీడియాలో ఒక వార్త కనిపిస్తోంది. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ చేయడానికి తనే కారణం అని చంద్రబాబు అన్నట్లుగా ఉందా వార్త. దీన్ని పట్టుకుని సోషల్ మీడియాలో బాబును కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. కానీ వాస్తవం ఏంటంటే.. చంద్రబాబు ఆ మాట అననే లేదు.

కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ యాజమాన్యానికి తాను ఫోన్ చేసి అభినందనలు చెప్పానని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన కృషి వల్లే బయోటెక్నాలజీ రంగంలో ఇంత పురోగతి సాధ్యమైందని, జీనోమ్‌ వ్యాలీ ఆసియాలోనే నెం.1గా ఉందని వాళ్ళు తనతో చెప్పారని.. అదెంతో సంతృప్తినిచ్చిందని మాత్రమే చంద్రబాబు అన్నారు. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి తనే కారణం అని ఆయన ఎక్కడా అనలేదు. కానీ మీడియాలో మాత్రం ఇలాగే వార్త వచ్చింది. దాన్ని పట్టుకుని చంద్రబాబును కామెడీ చేస్తున్నారు వ్యతిరేకులు.

This post was last modified on July 6, 2020 4:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

నీల్ తప్ప ఎవరూ చెప్పలేని గుట్టు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…

2 hours ago

మరో బాహుబలి.. ట్రెండ్ సెట్ చేస్తుందా

కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…

2 hours ago

గుడ్డు-మ‌ట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!

మాట‌ల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. త‌మ వ్యం గ్యాస్త్రాలు,…

2 hours ago

సమ్మర్ హీట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్

ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు  జారీచేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్‌,…

3 hours ago

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

12 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

13 hours ago