ఏపీ రాజకీయాల్లో టీడీపీ శైలి విభిన్నం. ఏం చేసినా.. ఒక ప్రణాళికప్రకారం.. ఒక నిర్దిష్ట విధానం ప్రకారమే జరుగుతుంది. ఎక్కడా అజాగ్రత్తలకు తావుండదు. అందుకే.. క్రమశిక్షణ ఉన్న పార్టీగా.. ఎప్పటి నుంచో టీడీపీకి పేరుంది. అయితే..రాను రాను ఈ విషయంలో నాయకుల శైలి మారుతోంది. గతంలో సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేసిన నాయకులు.. ఇప్పుడు.. తమ మేలుకోసం పరితపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. “మాకేంటి?” అనే సంస్కృతి పెరిగిపోయింది.
దీంతో నాయకులు ముందుకు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని.. చంద్రబాబు సహా కీలక నేతలు పిలుపు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా కదలిక కనిపించడం లేదు. దీనికి కారణం.. కొన్ని విషయాల్లో నాయకులు క్లారిటీ కోరుతుండడమే. ముఖ్యంగా ఈ జాబితాలో నాయకులు మూడు విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఒకటి… వచ్చే ఎన్నికల్లో పొత్తులు. టీడీపీ అయితే.. పొత్తులతో ముందుకు సాగుతాననే సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ పొత్తులు ఏ పార్టీతో ఉంటాయి? ఎలా ఉంటాయి? అనేది.. నేతల మధ్య చర్చకు వస్తోంది. ఎందుకంటే.. పొత్తులు కన్ఫర్మ్ అయ్యేవరకు కూడా తమకు సీటు దక్కుతుందో లేదో.. అనే బెంగ వారిని వెంటాడుతోంది. ఇప్పుడు కాలికి బలపం కట్టుకని తిరిగి.. తీరా ఎన్నికల వేళకు వేరేవారికి టికెట్ ఇస్తే.. తమ పరిస్థితి ఏంటని.. నాయకులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ కోరుతున్నారు.
రెండు.. ఎన్నికల హామీలు. ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు.. పేదలకు.. నెల నెలా డబ్బులు పంచుతున్నాయి. దీంతో పేదల దృష్టి వైసీపీపైనే ఉందనేది టీడీపీ నాయకుల ప్రగాఢ విశ్వాసం. దీంతో పేదలను.. మన వైపు తిప్పుకోవాలంటే.. మనం కూడా అంతే బలమైన వాగ్దాలను ప్రజలకు ఇవ్వాలనేది వారి మాట. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏంటనేది వారి ప్రశ్న. దీనిపైనా వారు క్లారిటీ కోరుతున్నారు.
మూడు.. యువ నాయకులకు టికెట్లు అంటున్నారే తప్ప.. ఎవరికి ఇస్తారు? అనేది మాత్రం చెప్పడం లేదు. దీంతో ఇక్కడ కూడా సందిగ్ధావస్తే కొనసాగుతోంది. యువ తరం అంటే.. ఇప్పటికే ఉన్న సీనియర్ల కుటుంబాల నుంచి వచ్చిన యువతా? లేక.. కొత్తగా పార్టీకి అండగా ఉంటున్న యువతా? అనేది ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలు టీడీపీలో కొన్నాళ్లుగా చర్చకు వస్తున్నాయి.
అయితే.. వీటిపై చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. ఇవి.. రాజకీయంగా ప్రభావం చూపే అంశాలు కావడంతో ఆయన ముందు.. మీరు క్షేత్రస్తాయిలో పనులు ప్రారంభించండని చెబుతున్నారే తప్ప.. ఎక్కడా క్లూ ఇవ్వడం లేదు. దీంతో నాయకులు కూడా తమ పంథా వీడడం లేదు. మరి ఈ ముసుగులో గుద్దులాట ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 7, 2022 6:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…