ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు దాడులు చేయటం టీఆర్ఎస్ లో సంచలనంగా మారింది. లిక్కర్ స్కాం తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ ఉన్నతాధికారులు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ లోనే ఆరు చోట్ల దాడులు చేయడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ దాడులు కూడా టీఆర్ఎస్ కు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళ ఇళ్ళల్లోనే జరిగాయనే ప్రచారం పెరిగిపోతోంది.
సూదిని సృజన్ రెడ్డి, బోయినపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమసాగర్ రావుల ఇళ్ళు, ఆఫీసులపైన ఈడీ దాడులు చేసింది. వీళ్ళంతా టీఆర్ఎస్ లోని కీలక వ్యక్తులకు అత్యంత సన్నిహితులనే ప్రచారముంది. లిక్కర్ స్కామ్ లో బీజేపీ ఎంపీల ఆరోపణలను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు అభిషేక్ రావు బాగా సన్నిహితుడట. అందుకని స్కామ్ లో కవిత పాత్రపై నిగ్గు తేల్చటానికే అభిషేక్ రావుపై ఈడీ దాడులు చేసిందని పార్టీలో కూడా చెప్పుకుంటున్నారు.
ఏదేమైనా ముందు బీజేపీ ఎంపీలు కవితపై ఆరోపణలు చేయటం తర్వాత ఈడీ ఉన్నతాధికారులు టీఆర్ఎస్ లేదా కవితకు సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వాళ్ళ ఆఫీసులు, ఇళ్ళపై దాడులు జరగటం చూస్తుంటే ఏదో అనుమానాలుగానే ఉన్నాయి. ఊరికే ఈడీ అధికారులు ఎవరిపైనా దాడులు చేయరు. ఎవరితోనో ఎక్కడో లింకులుంటేనే దాడులు చేస్తారు. తమకు దొరికిన బీరకాయ పీచు లింకులను పట్టుకుని ఇక దాన్ని పీకిపీకి పాకనపెడతారు.
మొత్తానికి తాజా ఈడీ దాడులు టీఆర్ఎస్ లో మాత్రం కలకలం రేపుతున్నాయి. ఏరోజు ఏమవుతుందో ? ఎవరిపైన దాడులు జరుగుతాయో అర్థం కాక చాలామంది నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దాడులను ఆపలేరు అలాగని దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేని పరిస్ధితిలో పడిపోయారు గులాబీపార్టీ నేతలు. మొత్తానికి టీఆర్ఎస్ సన్నిహితులే టార్గెట్ గా ఈడీ దాడులు జరుగుతున్నాయన్న విషయంలో క్లారిటి వచ్చేసింది.
This post was last modified on September 7, 2022 11:51 am
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…