తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. విజయం తమదేనని చెప్పుకోవడం వరకే కాంగ్రెస్ నేతలు పరి మితమవుతున్నారా? భారం మొత్తం పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై వేసి.. తాము చోద్యం చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఉగాది పచ్చడిని తలపిస్తోందని చెబుతున్నారు. కేవలం 10 జిల్లాల్లో మాత్రమే.. పార్టీ పరిస్థితి బాగుందని.. ఆయా జిల్లాల్లో ఆశాజనమైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికక్కడ అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. బలమైన నాయకులు చాలా మంది టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. దీంతో ఆయా జిల్లాల్లో వారి హవానే కనిపిస్తోంది. ఒకప్పుడు.. రంగారెడ్డి జిల్లా అంటే.. కాంగ్రెస్‌కు పెట్టని కోట. అదేవిధంగా ఖమ్మం కూడా. ఇలా.. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే.. టీఆర్ఎస్ దూకుడుతో ఆయా జిల్లాల్లో నాయకులు జంప్ చేశారు.
ఫలితంగా కాంగ్రెస్ జెండా మోసే నాయకులు కనిపించడం లేదు. నాయకులు ఉన్నా.. సఖ్యతలేక నానా తిప్పులు పడుతోంది. ప్రస్తుతం 25 కు పైగా జిల్లాల్లో పార్టీ కేడర్ ఉన్నా.. నడిపించే నాయకులు లేక సతమ తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. అధికార పార్టీ టీఆర్ఎస్ సహా.. ప్రత్యర్థి పార్టీ బీజేపీ నుంచి కూడా.. చాలా మంది కాంగ్రెస్ నాయకులకు చాపకింద నీరులా ఆహ్వానాలు అందుతున్నాయి. వచ్చేయండి.. మేం చూసుకుంటాం! అని కీలక నేతల నుంచి భరోసా వస్తోంది.
ఈ పరిణామాలను ముందుగానే గుర్తించి అలెర్ట్ కావడంలో.. కాంగ్రెస్ విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని నడిపించే భారం మొత్తం రేవంత్‌పై వేసేయడం.. ఆయనే చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేయ డం.. మనం పనిచేసినా.. గుర్తింపు వస్తుందా? అనే సందేహాల మధ్య కాలక్షేపం చేయడం.. వంటివి పార్టీని జారుడుబండపై నిలబెడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి ఆయా జిల్లాల్లో పార్టీ పుంజుకోకపోతే.. అధికారం దక్కడం సాధ్యమేనా.. అనేది సీనియర్లు ఆలోచించుకోవాలని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 5, 2022 11:04 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…