నువ్వా నేనా అన్నట్లుగా ఉండే ఏపీ అధికార.. ప్రధాన ప్రతిపక్షం మధ్య నిత్యం ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో హైటెన్షన్ చోటు చేసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో తెర మీదకు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ తరఫున అన్న క్యాంటీన్లను నిర్వహించేందుకు వీలుగా మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేయగా.. అధికార వైసీపీ కార్యకర్తలు పలువురు అన్న క్యాంటీన్ మీద దాడి చేయటం.. ఆ సందర్భంలో చోటు చేసుకున్న రచ్చ తెలిసిందే.
తాజాగా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద శనివారం ఇలాంటి రచ్చే చోటు చేసుకుంది. ఈ క్యాంటీన్ ను తీసేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. నోటీసుల్లో పేర్కొన్న దాని ప్రకారం.. అన్న క్యాంటీన్ ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే అన్న క్యాంటీన్ ను మూయాలని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు తక్కువ ధరకు అన్నం పెడుతున్నా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడుతున్నారు. శనివారం అన్న క్యాంటీన్ వద్ద పంపిణీ చేస్తున్న భోజనాల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూరల పాత్రల్ని అడ్డుకున్నా.. వెనక్కి తగ్గకుండా పేదలకు అన్నం పెట్టారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో గత నెల 12న అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయటం.. దీన్ని మూసేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేయటంపై వివాదం నడుస్తోంది.
ఈ రోజున క్యాంటీన్ కు ఆహారం తెచ్చే వాహనాల్ని మధ్యలో ఆపేశారు. వాహనంలోని కూర పాత్రల్ని పోలీసులు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు కూరలు లేకుండానే ఆహారాన్ని టీడీపీ నేతలు పంపిణీ చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు పలువురు మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం హాట్ హాట్ గా మారింది.
ఏం చేసినా తాము భోజనం పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు తేల్చి చెప్పటంతో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అక్కడున్న షాపుల్ని బలవంతంగా పోలీసులు మూయించారు. చిరు వ్యాపారుల మీదా ఆంక్షలు విధించారు. మార్కెట్ కు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నేతలు.. కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. అన్నం పెట్టడం కూడా తప్పన్నట్లుగా జగన్ సర్కారు తీరు ఉందన్న విమర్శలు పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు అన్న క్యాంటీన్ కు పోటీగా వైసీపీ నేతలు కూడా ఐదు రోజుల క్రితం క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం వైసీపీ వారి క్యాంటీన్ కు సంబంధించిన టెంట్ ను అధికారులు తొలగించారు.
This post was last modified on September 3, 2022 9:46 pm
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…