ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎన్నికల హామీల్లో మద్య నిషేధం ఒకటి. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యమే దొరక్కుండా చేస్తామని ఘనంగా ప్రకటనలు చేశాడు జగన్. కానీ వాస్తవంలో జరిగింది వేరు. మునుపటి కంటే మద్యం అమ్మకాలు పెరిగాయి, కొత్తగా దుకాణాలు వెలిశాయి. ప్రభుత్వం ప్రధానంగా మద్యం ఆదాయం మీదే ఆధారపడుతోంది. ఈ ఆదాయం మీద భారీగా అప్పులు కూడా తెచ్చుకుంటోంది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కారు మీద సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి టైంలోనే ఛత్తీస్ గడ్ మంత్రి ఒకరు మద్యపానం గురించి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. వాటిని ఆంధ్రప్రదేశ్‌కు ముడిపెట్టి కౌంటర్లు వేస్తున్నారు మన నెటిజన్లు. మద్యపాన నియంత్రణ మీద ఛత్తీస్‌గడ్‌లో విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రాసిన మధుశాల పుస్తకంలోని కవితలను ఉటంకిస్తూ.. దేవాలయాలు, మసీదులు అల్లర్లకు కారణమైతే, మద్యం మాత్రం జనాలను ఒక్కటి చేస్తుందని వ్యాఖ్యానించారు. కాకపోతే మద్యం సేవించే వారిలో వ్యక్తిగత నియంత్రణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతే కాక మనం కూడా పండుగలు, ఎన్నికలప్పుడు మద్యం తాగుతాం కదా అని కూడా ప్రేమ్ సాయి వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్యపానం నియంత్రణ గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో మాట్లాడుతూ.. మద్యం గురించి సానుకూల వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రేమ్ సాయిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆయన అంతటితో ఆగకుండా రోడ్ల మ రమ్మతలులు చేపట్టకపోవడం సమర్థించుకోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చాలామంది రోడ్లు రిపేర్ చేయడం లేదేంటని తనకు ఫోన్లు చేస్తుంటారని.. కానీ రోడ్లు అలా ఉండడం వల్లే ప్రమాదాలు జరగట్లేదని ప్రేమ్ సాయి వ్యాఖ్యానించారు. మద్యం గురించి, రోడ్ల గురించి ప్రేమ్ సాయి చేసిన వ్యాఖ్యలు విని అవాక్కయిన తెలుగు నెటిజన్లు ఈ మాటలు కానీ జగన్ చెవిన పడితే.. ప్రేమ్ సాయిని అమరావతికి రప్పించి సన్మానం చేసినా చేస్తాడని కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on September 2, 2022 4:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…