Political News

వైసీపీ ఎంపీలు కేంద్రం పెద్దలను కలిసింది రెండేసార్లు.. ఎందుకంటే

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మొదలు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హోదాపై ఓ విధంగా చేతులెత్తేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల నుండి ప్రధానమంత్రి వరకు కలవడం సాధారణమే. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది ఎన్నిసార్లో తెలుసా.. కేవలం రెండుసార్లు.

అది కూడా తమ పార్టీకి చెందిన నేతల అంశంపై. వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను మొదటిసారి కలిసింది సెర్బియాలో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించమని కోరేందుకు. ఆ తర్వాత ఇటీవల రెండోసారి కలిశారు. ఇప్పుడు తమ పార్టీ నుండి గెలిచి.. వ్యతిరేక గళం విప్పుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోమని కోరేందుకు.

ఇటీవల రఘురామ కృష్ణంరాజు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకంపై గళమెత్తారు. రాజధానిగా అమరావతి ఉండాలని, భిన్నగళం వినిపిస్తున్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైసీపీ ఆయనపై వేటు వేద్దామనుకున్నప్పటికీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తూ.. వారికి రఘురామ అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. వారు రెండు రోజుల క్రితం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.

This post was last modified on July 5, 2020 10:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: BJPYSRCP MPS

Recent Posts

ఏప్రిల్ 25 – విష్ణు VS మనోజ్ ?

వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…

2 hours ago

కూలీ వేగం….నేర్చుకోవాల్సిన పాఠం

రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…

2 hours ago

రాజా సాబ్ కోసం తమన్ కొత్త ప్రయోగం

మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…

3 hours ago

అసలు నాగ్‌పూర్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…

4 hours ago

పాక్ క్రికెట్.. ఒక్క దెబ్బతో ఆవిరైన 869 కోట్లు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…

9 hours ago

ఖలిస్తానీ గ్రూప్‌పై రాజ్‌నాథ్ గురి.. అమెరికా ఎలా స్పందిస్తుందో?

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…

11 hours ago