ఏపీలో వివాదానికి కారణమైన మూడు రాజధానుల విషయం.. మరోసారి తెరపైకి రానుందా? ప్రభుత్వం తన పట్టును సమర్థించుకునేందుకు.. సాధించుకునేందకే ప్రాధాన్ం ఇస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీనిపై పెద్ద దుమారమేరేగింది. రాజధాని రైతులు.. ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు.. అమరావతికే మొగ్గు చూపింది.
రాజధాని అమరాతినే అభివృద్ది చేయాలని.. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు.. వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు అప్పగించాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే.. అది కూడా కేవలం మూడు మాసాల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ.. ఇది జరిగి 8నెలలు అయినా.. కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడ చేసింది ఏమీ కనిపించడం లేదు. దీంతో మరోసారి.. రైతులు ఉద్యమించేందుకురెడీ అవుతున్నారు.
ఈ దఫా.. అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 2 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని మరింత రెచ్చగొట్టేలా నిర్ణయం తీసుకున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు అడ్వకేట్ జనరల్ శ్రీరాం స్వయంగా ఓ మీడియాకు వెల్లడించడం గమనార్హం.
దీనిని బట్టి.. సర్కారు మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైసీపీలో జరుగుతున్న చర్చలను బట్టి.. దసరా తర్వాత లేదా.. అదే రోజు నుంచి సీఎం జగన్ విశాఖలోనే ఉంటారని.. అక్కడ నుంచి పాలన సాగిస్తారని తెలుస్తోంది. ఇది అధికారికంగా కాకుండా.. అనధికారికంగా అక్కడ నుంచి పాలన సాగిస్తారని చెబుతున్నారు. దీనిని బట్టి.. సర్కారు మూడు రాజధానులకే మొగ్గు చూపుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎలాంటి పరిణామాలకుదారితీస్తుందో చూడాలి.
This post was last modified on August 29, 2022 2:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…