ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ తీరును ఎండగడుతూ.. ఇప్పటికే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా తమముళ్లను సమాయత్తం చేస్తోంది. సెప్టెంబరు 1 నుంచి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. అదే రోజున ఉద్యోగులు కూడా సీపీఎస్ కోసం ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. `సీఎం ఇంటి ముట్టడి`కి, మిలియన్ మార్చ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వేడి ఒకవైపు సర్కారును రిస్క్ పెడుతుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా రెడీ అయింది.
రాష్ట్రంలో వినాయకచవితి పందిళ్లను వేసేవారి నుంచి రిజిస్ట్రేషన్ రుసుమును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు.. వలంటీర్లను రంగంలోకి దింపారు. పోలీసు స్టేషన్లలోనూ.. రిజిస్ట్రేషన్ల రుసుము పత్రాలు చూపిస్తేనే అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఈ విషయంపై బీజేపీ రాజకీయ దూకుడు ప్రదర్శించాలని నిర్నయించింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని.. పార్టీ నిర్నయం తీసుకోవడంతో.. వచ్చే నాలుగు రోజులు .. ఏపీ మరింత హీటెక్కనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్టాడుతూ.. సర్కారుపై సీరియస్ అయ్యారు. విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాలా అని మండిపడ్డారు. నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను, ఉత్సవ సమితి సభ్యులను వేధిస్తూ.. ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలకు దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే.. సోమవారం నుంచి ఓ నాలుగు రోజుల పాటు ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయనేది వాస్తవం.
This post was last modified on August 29, 2022 12:10 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…