రాజకీయంగా పట్టు సాధించాలని.. ఏ పార్టీ అధినేతకైనా ఉంటుంది. అయితే.. దీనికి సంబంధించి అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా.. అంతా నాకే దక్కాలి.. అన్ని సీట్లలోనూ నేనే విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని.. లక్ష్యంగా.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ క్రమంలో ఇతర పార్టీలను.. ట్రీట్ చేస్తున్న తీరు మాత్రం వివాదాలకు.. విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ..రాష్ట్రంలో రాజకీయ వైరాలు.. ప్రత్యర్థులను నిలువరించడం..అనేది కొత్తకాదు.
ఇప్పుడే.. టీడీపీ పుట్టింది కూడా లేదు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా.. చంద్రబాబును నిలు వరించే ప్రయత్నాలు సాగాయి. అయితే.. ఆయనను వ్యక్తిగతంగా ఓడించాలని.. కుప్పంలో ఆయన పార్టీని భూస్థాపితం చేయాలని.. ఎప్పుడూ.. వైఎస్ అనుకోలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా లక్ష్యంగా పెట్టుకోలేదు. రాజకీయంగా అనేక వైరాలు ముందుకు సాగాయి. అయితే.. ఇప్పుడు… పరిస్థితి మారిపోయి.. వ్యక్తిగతంగా చంద్రబాబుపై కసి తీర్చుకోవాలనే ధోరణి పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే .. కుప్పంపై జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక ఆపరేషన్లు సాగుతున్నాయి. ఇక్కడ మిని మునిసిపాలిటీని ప్రకటించారు. అదేసమయంలో అందరికీ పింఛన్లు ఇస్తున్నారు. నాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారు. రాష్ట్రంలో అందరికీ 1వ తేదీనే పింఛన్లు ఇస్తుంటే.. కుప్పంలో మాత్రం 30 లేదా.. 31వ తారీకు(అంటే.. 1వ తేదీ కంటే ముందే) అర్ధరాత్రి నుంచే పింఛన్లు ఇస్తున్నారు. ఇక, ఇటీవల 66 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. ఇవన్నీ మంచిదే.. రాజకీయంగా పట్టు సాధించేందుకు అవసరమే.
దీనిని ఎవరూ తప్పుబట్టలేదు. చంద్రబాబు కూడా వీటిని వద్దని చెప్పలేదు. ఇలాంటి సమయంలో.. చంద్రబాబును అసలు కుప్పంలోకి కూడా రాకుండా అడ్డుకోవలని నిర్ణయించడం.. అలజడి సృష్టించడం ..అన్నక్యాంటీన్‌ను ధ్వంసం చేయడం.. వంటి పరిణామాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది.. వైసీపీలో నే చర్చకు వస్తోంది. ఇంతగా అభివృధ్దికార్యక్రమాలు చేస్తూ.. కూడా ఇలా నిలువరించడం అంటే.. వైసీపీ లో ఏదైనా జంకు తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా వైసీపీ అనుసరించిన విధానంపై విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on August 28, 2022 1:22 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…