ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల గుప్త విరాళాల(గుర్తు తెలియని మూలాల నుంచి) రూపంలో అందినట్లు తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఈ రూపంలో విరాళంగా అందినట్లు తెలిపింది.
మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను ఏడీఆర్ పరిగణనలోకి తీసుకుంది. 2004-05, 2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద సమర్పించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు, డొనేషన్‌కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8 జాతీయ పార్టీలు తమకు గుర్తు తెలియని మూలల నుంచి రూ.426.74 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయని ఏడీఆర్ పేర్కొంది. 27 ప్రాంతీయ పార్టీల నుంచి రూ.263.92 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయని తెలిపింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 178.782 కోట్లు గుప్త విరాళాలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. జాతీయ పార్టీలకొచ్చిన ఇటువంటి విరాళాల్లో ఈ వాటా 41.89 శాతం కావడం గమనార్హం. ఇదే కాలానికి గుర్తు తెలియని మూలాల నుంచి రూ.100.502 కోట్లు విరాళంగా వచ్చినట్లు బీజేపీ పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది.
ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఐదు పార్టీలు అత్యధికంగా ఈ తరహా నిధులు అందుకున్నాయి. ఇందులో వైసీపీ రూ.96.25 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.77 కోట్లు, ఆప్ రూ.5.4 కోట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.
జాతీయ, ప్రాంతీయ పార్టీలకొచ్చిన మొత్తం రూ.690.67 కోట్ల నిధుల్లో 47.06 శాతం ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో.. ఆప్, ఏజీపీ, ఏఐఐఏడీఎంకే, ఏఐఎఫ్‌బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బీజేడీ, సీపీఐ (ఎంఎల్) (ఎల్), డీఎండీకే, డీఎంకే, జీఎఫ్‌పీ, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్ఎస్, ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్, పీఎంకే, ఆర్ఎల్‌డీ, ఎస్ఏడీ, ఎస్‌డీఎఫ్, శివసేన, ఎస్‌కేఎం, టీడీపీ, వైసీపీ, టీఆర్ ఎస్ ఉన్నాయి.
This post was last modified on August 27, 2022 12:04 pm
వైసీపీలో ఏం జరుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవరి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవరో కాదు.. జగన్కు…
జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన…
అమరావతి రాజధానికి కొత్తగా రెక్కలు తొడిగాయి. సీఎం చంద్రబాబు దూరదృష్టికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులు క్యూకట్టారు. ప్రధాన…
ఏ ముహూర్తంలో మొదలయ్యిందో కానీ మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానుల మధ్య తరచు ఆన్ లైన్ గొడవలు జరగడం చూస్తూనే…
టాలీవుడ్ స్టార్ల అభిమానులు తమ హీరోతో జట్టు కడితే బాగుంటుందని ఎదురు చూస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీతో తెలుగులోనూ…
ఈ ఏడాది ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడుని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. విడుదల…