ఏపీ అప్పులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. కాగ్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో అప్పుల పరంపర అలాగే కొనసాగుతోందని తెలిపింది. రెవెన్యూ లోటు పెరుగుతూనే ఉందని పేర్కొంది. ఇదే కొనసాగితే..రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే ప్రమాదకర పరిస్థితి వస్తుందని హెచ్చరించింది.
ఏడాది మొత్తానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు లెక్కించారో, అది కేవలం 2 నెలల్లోనే మించిపోయిందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.17,036.15 కోట్లకు రెవెన్యూ లోటును సరిపెడతామని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారని, చట్టసభలకు కూడా హామీ ఇచ్చారని తెలిపింది.
కానీ, ఆ అంచనా కేవలం 2 నెలల్లోనే తప్పిందని ప్రభుత్వ తీరును పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలాఖరువరకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ రాబడికన్నా రెవెన్యూ ఖర్చు రూ.17,036.15 కోట్లు ఉంటుందని లెక్కిస్తే ఈ 2 నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.21,924.85 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే అంచనాతో పోలిస్తే ఇప్పటికే 128 శాతం రెవెన్యూ లోటు ఉందని పేర్కొంది.
ఏ రాష్ట్రంలోనైనా, ఏ కుటుంబంలోనైనా రాబడి ఎక్కువ ఉండి అందులో అప్పులు కొద్ది శాతానికి పరిమితం కావాలని కాగ్ వివరించింది. అలాంటిది ప్రస్తుతం ఏపీలో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాబడిని మించి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అన్ని రకాల ఆదాయాలు కలిసి రూ.17,975.28 కోట్లు వచ్చిందని, అదే సమయంలో రూ.22,960.96 కోట్లు అప్పు తీసుకున్నారని నివేదిక స్పష్టం చేసింది.
ఆ రెండు కలిపి మొత్తం రూ.39,900 కోట్లు ఖర్చు చేశారని వివరించింది. అదే సమయంలో మూలధన వ్యయమంటే ఆస్తులు సృష్టించేందుకు చేసిన ఖర్చు రూ.996 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాల రూపంలో వివరించింది. దీనిని బట్టి రాష్ట్రం మరిన్ని అప్పులు చేసే దిశగా అడుగులు వేస్తే.. ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా సాగినట్టేనని కాగ్ హెచ్చరించడంగమనార్హం.
This post was last modified on August 26, 2022 6:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…