Political News

ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యే: వైసీపీలో చ‌ర్చ‌

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌కుకంటిపై కునుకు ఉండ‌డం లేదా?  ముఖ్యంగా ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా మారిందా? ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని నాయ‌కులు క‌ల‌వ‌రం చెందుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు తొలి రెండేళ్లు క‌రోనా ఎఫెక్ట్‌తోనే స‌రిపోయింది. త‌ర్వాత‌.. అంతో ఇంతో బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఆర్థిక స‌మ‌స్య‌లు వారిని వెంటాడాయి. ఇంతలో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వ‌లంటీర్ల కార‌ణంగా..వారిని ప‌ట్టించుకున్న ప‌రిస్థితిలేదు.

అయితే.. ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని.. వారికి మాత్ర‌మే టికెట్లు ఇస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ స్ఫ‌ష్టం చేశారు. కానీ, చాలా మంది నాయ‌కులు.. చేతిలో నిధులులేవు.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్తే.. వారికి ఏం చెప్పాలి.. వారు కోరిన విధంగా చేయాలంటే.. చేతిలో డ‌బ్బులు ఉండాలి క‌దా? అని చెబుతున్నారు. దీంతో స‌గం మంది ఎమ్మెల్యేలు.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం లేదు. మ‌రికొంద‌రు మాత్రం ఇంకా స‌మ‌యం ఉంది క‌దా.. అనే ధోర‌ణిలో ఉన్నారు. ఈ ప‌రిణామాలు.. పార్టీలో ఇప్పుడు క‌ల‌వ‌రం రేపుతున్నాయి.

ఎవ‌రైతే.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేదో వారికి చెక్ పెట్టేదిశ‌గా పార్టీ అధిష్టానం చ‌ర్య‌లకు దిగుతోంది. మ‌రోవైపు.. పార్టీలో ఇప్పుడు.. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప‌రిణామం.. మ‌రింత క‌ల‌వ‌ర పెడుతోంది. ఇక్క‌డ వివాద‌స్ప‌దంగా మారార‌నే కార‌ణంగా ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి అధిష్టానం చెక్ పెట్టింది. స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద‌రావును నియ‌మించింది. ఈ ప‌రిణామం.. ఇత‌ర ఎమ్మెల్యేల్లో తీవ్ర‌స్థాయిలో గుబులు రేపుతోంది.

స్థానికంగా వివాదాల‌తో న‌డుస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎంపీల‌తో ప‌డ‌క‌పోవ‌డం.. అధికారుల‌తో విభేదాలు.. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు.. వివాదంగానే ఉన్నారు. ఇప్పుడు వీరికి కూడా చెక్ పెడితే ప‌రిస్థితి ఏంట‌ని వారు త‌ల్ల‌డిల్లుతున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం త‌మ‌కు నాయ‌కులు ప్ర‌ధానం కాద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాత్ర‌మే ప్ర‌ధాన‌మ‌నే సంకేతాల‌ను స్ప‌ష్టంగా పంపేసింది. దీంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలే. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌తో మమేకం కావ‌డం అనే రెండు ప‌ట్టాల‌పైనే వారు ప్ర‌యాణించాల్సి ఉంది.. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on August 26, 2022 11:32 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

7 hours ago