టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. దీనిపై అధికార పార్టీ వైసీపీ నుంచిసూటి పోటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యారని.. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేదని.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ను ఎట్టి పరిస్థితిలోనూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కించి.. అసెంబ్లీకి పంపించాలనే లక్ష్యం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ విషయంపై … పార్టీ అధినేత చంద్రబాబు కూడా మెగా ఆలోచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యం గా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాజధాని ఏర్పాటు చేసిన కారణంగా.. మంగళగిరి నియో జకవర్గం అయితే.. బాగుంటుందని.. ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని.. పార్టీ నాయకులు భా వించారు. దీనిపై మరో మాట లేకుండా.. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. లోకేష్ ఇక్కడ పరాజయం పొందారు. దాదాపు 5 వేల ఓట్ల తేడాతో విజయానికి ఆయన దూరమయ్యారు.
దీంతో మరో నియోజకవర్గం కోసం.. పార్టీ అధినేత ప్రయత్నాలు చేశారనే వాదన వినిపించింది. కానీ, లోకేష్ మాత్రం మంగళగిరికే పరిమితం అవ్వాలని.. ఓడిన చోటే గెలిచి.. వైసీపీకి లెస్సన్ చెప్పాలని.. ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు అనుకున్న విధంగా మంగళగిరి టీడీపీ రాజకీయాలు లేవు.
కీలకమైన నాయకులు.. పార్టీ నుంచి దూరమయ్యారు. దీంతో ఇప్పుడు లోకేష్‌కు అండగా నిలిచేవారు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు.. లేకుండా పోయారు. దీంతో చంద్రబాబు మరో ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారని.. పార్టీలో చర్చసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను మరో నియోజకవర్గం నుంచి కూడా ఏకకాలంలో పోటీ చేయించాలని.. ఆయన భావిస్తున్నారట. మంగళగిరి సహా.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట లేదా.. ఉండి నియోజకవర్గాల నుంచి ఇవి కాకపోతే.. విశాఖలోని గాజువాక… విశాఖ తూర్పుల నుంచి కానీ.. లోకేష్‌ను పోటీ చేయించాలని.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం.
దీనిని బట్టి.. ఖచ్చితంగా లోకేష్ అసెంబ్లీలో అడుగు పెట్టేలా.. చంద్రబాబు అడుగులు పడుతున్నాయని పార్టీఆ సీనియర్లు చెబుతున్నారు. రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ద్వారా.. ఎక్కడో ఒక చోట ఆయన గెలుపు ఖాయమని.. పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. మరిఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో.. చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన నాయకుడిగా.. లోకేష్ రికార్డు సృష్టించడం ఖాయం.
This post was last modified on August 26, 2022 11:21 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…