Political News

ఆ దూకుడే ఉండ‌వ‌ల్లికి సెగ పెట్టిందా..?

ఎంత ఎమ్మెల్యే అయినా.. ఎంత అధికార పార్టీ నాయ‌కురాలైనా.. కొన్ని హ‌ద్దులు ఉంటాయి.. కొన్ని ప‌రిమితులు కూడా ఉంటాయి. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసి ఉండ‌డం .. అత్యంత అవ‌స‌రం. అయితే ఈ విష‌యంలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. అన్ని హ‌ద్దులు చెరిపేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డ ఆమెకు పోటీగా అధిష్టాన‌మే.. కొత్త‌గా స‌మ‌న్వ‌య క‌ర్త‌గా డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావును నియ‌మించింది.

ఇది తీవ్ర వివాదంగా మారింది. అయితే.. దీని పూర్వాప‌రాలు గ‌మ‌నిస్తే.. త‌ప్పంతా.. శ్రీదేవి వైపే ఉంద‌ని.. పార్టీలోగుస గుస వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి అనూహ్యంగా ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె విజయం సంచలనమే అయినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పేకాట శిబిరాల నిర్వహణలో ఆమె పేరు ప్రముఖంగా వినపడింది.

ఆమె అనుచరులే ఈ విషయాన్ని బయటపెట్టి.. రచ్చ చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో విభేదాలు, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిలబడి… ఇది అంబేడ్కర్‌ విగ్రహమే కదా అని అడగటం, మాదిగలు అంబేడ్కర్ కంటే.. జగ్జీవన్ రాం పేరు ఎక్కువగా తలచుకోవాలని ప్రకటించడం వంటివి.. వివాదాల్లోకి లాగాయి. స్థానిక ప్రజాప్రతినిధుల్ని కూడా పట్టించుకోకుండా… ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఇవన్నీ శ్రీదేవికి ప్రతికూలంగా మారి… డొక్కాకు మార్గం సుగమం చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా.. సొంత పార్టీ నేత‌ల నుంచి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పులు చేసిన ఆమె.. స‌గం చెల్లించి.. మిగిలిన సొమ్మునుఇవ్వ‌కుండా.. పోలీసుల‌తో వారిపైనే కేసులు పెట్టించ‌డం .. అధిష్టానం వ‌ర‌కు వెళ్లింది. వీటిని ఎక్క‌డో ఒక చోట సామ‌ర‌స్య పూర్వ‌కంగా.. ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయాల్సిన .. శ్రీదేవి ఆదిశ‌గా అడుగులు వేయ‌లేద‌ని.. వైసీపీలో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌తోనే అధిష్టానం ఆమెకు చెక్ పెట్టింద‌నే వాద‌న వినిపిస్తోంది.  

This post was last modified on August 26, 2022 9:58 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

18 seconds ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

29 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

43 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

45 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago