రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించింది. దీనిపై చర్చ జరగాల్సిందేనని అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని హెచ్చరించింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాలను వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఉచితాలు తీవ్రమైన అంశమని.. అందులో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వికాస్‌సింగ్.. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా.. ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. పదవీ విరమణ చేసిన వ్యక్తికి.. పదవీ విరమణ చేయబోయే వ్యక్తికి ఈ దేశంలో విలువ ఉండదని వ్యాఖ్యానించారు.
సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్వచ్ఛంద సంస్థ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 3 రకాల ఉచితాలను నిషేధించాలని కోరారు. వివక్ష చూపేవి, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవి, ప్రజావిధానానికి విరుద్ధమైన ఉచితాలను నిషేధించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లేదా కేంద్రంలో.. అధికారంలో లేని రాజకీయపార్టీలు ఉచిత వాగ్దానాలను ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించింది.
రాజకీయ పార్టీలు ఉచితాలు తమ హక్కు అని పేర్కొంటూ.. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉచితాలను అందించడం తమ ప్రాథమిక హక్కుగా భావించే కొన్ని రాజకీయ పార్టీలు.. అలాంటి ఉచితాలు మాత్రమే అందించి అధికారంలోకి కూడా వచ్చాయని(ఏపీని ఉదహరిస్తున్నారు) సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేదే అతిపెద్ద సమస్యగా మారిందని సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. అంతిమంగా రాజకీయ పార్టీలు మాత్రమే ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తాయని.. వ్యక్తులు కాదన్న సీజేఐ తెలిపారు.
ఉచితాలు లేకుండా తాను పోటీచేసినా పది ఓట్లు కూడా రాకపోవచ్చని సీజేఐ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత వ్యవస్థలో వ్యక్తులకు పెద్దగా ప్రాధాన్యం లేదన్న సీజేఐ జస్టిస్ రమణ.. ఎన్నికల మేనిఫెస్టో అంశాలపై ఈసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2013లో ఇచ్చిన తీర్పుపై.. పునః పరిశీలిన అవసరమన్నారు. ఈ తీర్పును పరిశీలించడానికి ముగ్గురు జడ్జీల బెంచ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఉచితాలపై బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ ఉచితాలు కోరుకుంటారని, అందుకే తామే ఉచితాలపై జోక్యం చేసుకున్నామని ధర్మాసనం వెల్లడించింది.
This post was last modified on August 25, 2022 2:27 pm
హీరోయిన్లు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వెల్లడించడం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న దశలో ఆ రంగంలోకి అడుగు పెట్టడం…
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన కొనసాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భక్తులకు-భగవంతుడికి మధ్య టీటీడీ బోర్డు ఉంటుంది.…
నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం…
నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తండేల్ నుంచి నిన్న ఓం నమః శివాయ…
ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్దే.…
టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ…