ఏపీ సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంటే! అని వైసీపీ నాయకులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఆయ న ఎన్నో చెప్పినా.. కొన్ని మాత్రమే చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే.. అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూడా సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మరి ఇది ఏం చేస్తారో చూడాలి. 2023 సెప్టెంబరులో వెలి గొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు.
ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు. గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని.. మళ్లీ శ్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మా విధానాల వల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయని.. కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
7 వేల యూనిట్లకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేశామని.. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల్లో రూ.2 తగ్గిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
ఇదో సరదా సన్నివేశం..
సీఎం జగన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో.. ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ.. దివంగత వైఎస్పై ఓ పాట పాడారు. కొద్దిసేపు పాడిన తర్వాత.. ఇక చాలని సీఎం జగన్ సూచించినా ఆమె పట్టించుకోలేదు. అదే ఒరవడితో పాట కొనసాగించారు. వెంటనే తన స్థానం నుంచి లేచి వచ్చిన జగన్…. వెంకాయమ్మను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.
This post was last modified on August 25, 2022 12:18 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…