వైసీపీ అధిష్టానం చేస్తున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఎస్సీలకు అండగా ఉంటామని పదే పదే చెప్పే పార్టీ.. ఇప్పుడు అదే ఎస్సీ నేతల మధ్య చిచ్చు పెట్టి వినోదం చూస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీలో రాజకీయా లు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తున్నట్లు.. వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
సాధారణంగా పార్టీకి ఎమ్మెల్యే లేని చోట్ల ఇన్‌ఛార్జ్‌లు ఉంటారు. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. అదనపు ఇన్‌ఛార్జ్‌గా మరో ఎస్సీని నియమించడం.. రాజకీయంగా ఎస్సీలకు.. ఎస్సీలకు మధ్య చిచ్చుపెట్టడమేననే వాదన వినిపిస్తోంది. ఎస్సీల ఆత్మాభిమానంతో వైసీపీ అధిష్టానం ఆడుకుంటోందా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
డొక్కా నియామక ప్రకటన వెలువడగానే.. శ్రీదేవి విస్తుపోయారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు సుచరిత ఇంటి ఎదుట.. అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించి.. రాజీనామాలు చేస్తామని ప్రకటింపజేశారు. అయినా అధిష్ఠానం నుంచి స్పందన రాలేదు. దీంతో శ్రీదేవి ఇంట్లోంచి బయటకు రావడం లేదు. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆపేశారు. మరోవైపు అదనపు ఇన్‌ఛార్జ్‌గా పార్టీ పదవితో పాటు.. శాసనమండలి విప్‌గానూ డొక్కా డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. గతంలో ఈ నియోజక వర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అనుభవం ఆయనకుంది.
పాత పరిచయాలుండటంతో ఒక్కసారిగా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో తిరుగుతూ నాయకుల్ని కలుస్తున్నారు. ఎవరికైనా… ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో ఓ స్పష్టత వస్తుంది. కానీ డొక్కా ని యామకం ద్వారా… ఈసారి తాడికొండ అభ్యర్థి ఆయనేనన్న సంకేతాలను పార్టీ పంపినట్లయింది. మొదట్లో శ్రీదేవికి మద్దతుగా మాట్లాడిన కొందరు వెనక్కి తగ్గారు. తాజాగా ఆమెకు మద్దతుగా మేడికొండూరులో సమా వేశం చేపట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
అధికార పార్టీ వారినే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడంతో.. ఆమెకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవనే సంకేతాలు పంపినట్లయింది. తాజా పరిణామాలతో శ్రీదేవికి కన్నీరొక్కటే మిగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి అనూహ్యంగా ఉండవల్లి శ్రీదేవి.. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె విజయం సంచలనమే అయినప్పటికీ.. ఇప్పుడు అధిష్టానం.. ఎస్సీలకు ఎస్సీలకు మధ్య చిచ్చు పెట్టడమే.. చిత్రంగా ఉందని అంటున్నారు. మరి ఈపరిణామం.. ఎటు దారితీస్తుందో చూడాలి.
This post was last modified on August 24, 2022 10:13 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…