శాంతి భద్రతలను కాపాడాల్సిన … ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు పడితే చాలు.. కొట్టుకునే పరిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత.. అంటూ.. ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా సరిహద్దు దాటొద్దు..` అని ఒకరికి ఒకరు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కారణం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న రాజకీయ మంటలే!
గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన విషయం గుర్తుందా? ఆ సమయంలో రాజకీయంగా తెలంగాణ నాయకులు ఏపీపై విరుచుకుపడిన విషయం మరిచిపోలేదు కదా! అప్పట్లో ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య తీవ్ర యుద్ధం తెరమీదికి వచ్చింది. ఒక సందర్భంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు లాఠీచార్జీ చేసుకునే వరకు ఉద్రిక్తతలు చేరుకున్నాయి.
అయితే.. ఈ విషయాన్ని నేతలు మరిచిపోయారు. కానీ, పోలీసులు మాత్రం ఇంకా వివాదాల నుంచి బయటకు రాలేదు. రాజకీయ నేతలు రగిల్చిన మంట వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా.. అదే
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పై.. తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనం రావడంతో తెలంగాణ పోలీసులు, సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ పరిణామంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే.. ఈ ఘర్షణ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. కానీ, రాజకీయంగా ఏర్పడిన ఈ వివాదం.. ప్రస్తుతానికి సమసిపోయిందని భావిస్తున్నా.. భవిష్యత్తులో మాత్రం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 8:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…