అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపిక దాదాపు డిసెంబర్ కల్లా పూర్తయిపోతుందని సమాచారం. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్నిచోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. అలాగే మరికొన్ని చోట్ల సమన్వయకర్తలను కూడా ప్రకటిస్తున్నారు. మామూలుగా అయితే ఎంఎల్ఏలు లేని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలుగా నేతలనో లేకపోతే ఓడిపోయిన ఎంఎల్ఏలనో నియమించటం సాధారణం.
కానీ ఇక్కడ జగన్ ఏమి చేస్తున్నారంటే ఎంఎల్ఏలున్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తల పేరుతో నేతలను నియమిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఎంఎల్ఏ శ్రీదేవి ఉన్నప్పటికీ అదనపు సమన్వయకర్తగా ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావును నియమించారు. ఈ నియామకం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తలను జగన్ నియమిస్తున్నారంటే సదరు ఎంఎల్ఏ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారనే అర్ధం.
గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం అమలవుతున్న తీరుపై జగన్ ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. దాని ఆధారంగానే ఎంఎల్ఏల పనితీరును లెక్కేస్తున్నారు. దీని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లిస్తానని గతంలోనే స్పష్టంగా అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇపుడు అదనపు సమన్వయకర్తల నియామకం ఎంఎల్ఏల పనితీరు ఆధారంగా చేస్తున్నదే. అభ్యర్ధుల ఎంపిక లేదా అదనపు సమన్వయకర్తల నియామకం అన్నది రాబోయే దసరా పండగ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేసేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.
ప్రతినెలా జగన్ సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరు, మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై సర్వేలు జరుగుతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే ప్రక్రియలో బిజీగా ఉన్నది. ఐప్యాక్ టీమ్ తో పాటు ఇంటెలిజెన్స్, ఇతర మార్గాల్లో కూడా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఈ రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థులు లేదా అదనపు సమన్వయకర్తల నియామకాన్ని ఫైనల్ చేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికలకు జగన్ ఇటు ప్రభుత్వం అటు పార్టీపరంగా అన్ని విధాలుగా సిద్ధపడుతున్నట్లు అర్ధమవుతోంది.
This post was last modified on August 24, 2022 5:34 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…