Political News

తెలంగాణది నెం.1 స్థానం… పాజిటివ్ రేటు చూడండి

తెలంగాణలో ఒక్క రోజులో మునుపటి రోజుపై 40 శాతం కేసులు పెరగడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కరోనా రోగుల సంఖ్యలో తెలంగానది ఐదో ఆరో స్థానమో కావచ్చు గాని పాజిటివిటీ రేటు అటూ చాపకింద నీరులా అది వ్యాపించిన తీరు ఘోరంగా ఉంది. టెస్టుల్లో వచ్చే పాజిటివ్ కేసుల పర్సెంటీజేలో దేశంలో తెలంగాణది నెం.1 స్థానం. అంటే డేంజర్ పరంగా మహారాష్ట్రకు తెలంగాణ ఏం తీసిపోదు అని దీనర్థం.

దేశంలోనే అతితక్కువ టెస్టులు చేసిన తెలంగాణపై అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక క్రమంగా టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. దాంతో నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే అందరికీ కనిపించే ఈ కేసుల నెంబరు కన్నా కరోనా తెలంగాణలో వ్యాప్తిస్తున్న తీరు ప్రజలను ప్రభుత్వాన్ని భయకంపితులను చేస్తోంది.
వారం క్రితం వరకు వందల్లో వచ్చిన కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. వారం నుంచి రోజుకు వెయ్యికి అటూ ఇటూ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. శుక్రవారం ఏకంగా 1892 కేసులు బయటపడ్డాయి. ఇది నగర పరిస్థితి తీరుకు, తెలంగాణలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. చేసిన టెస్టుల్లో వందకు ఎన్ని పాజిటివ్ అన్నది చూస్తే తెలంగాణ మొదటి స్థానంలో, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉండటం గమనార్హం.

ఇప్పటివరకు చేసిన టెస్టులు – లక్షా 4 వేలు
మొత్తం కేసులు – 20,462
ఓవరాల్ పాజిటివ్ రేటు – 19.65 శాతం
గత వారం రోజుల పాజిటివ్ రేటు – 31.71 శాతం

ఇతర రాష్ట్రాల పరిస్థితి
మహారాష్ట్ర – 18.34 శాతం
ఢిల్లీ – 16.1 శాతం
తమిళనాడుల – 8 శాతం
ఏపీ – 1.74 శాతం

This post was last modified on July 4, 2020 2:10 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

44 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

1 hour ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago