Political News

టీఆర్ఎస్ కొత్త తీరు.. ఛోటా నేతలకు భారీ ధర!

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ అధికారపక్షం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తోంది. తమకున్న అధికార బలాన్ని ప్రదర్శించటమే కాదు.. ధనబలాన్ని చూపేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా సరికొత్త ఎత్తులకు తెర తీస్తోంది. మొత్తంగా తెలంగాణలో సరికొత్త రాజకీయాన్ని టీఆర్ఎస్ పరిచయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉప పోరు ఫలితం.. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్ని ప్రభావితం చేసే వీలు ఉండటంతో తమ ప్రత్యర్థులైన బీజేపీ.. కాంగ్రెస్ లకు ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ఎన్నికల్లో కీలకమైన ఛోటా నేతలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ వారు ఊహించలేనంత భారీ ఆపర్లను ఇస్తున్నట్లు చెబుతున్నారు. గుండుగుత్తుగా ఓట్లను ప్రభావితం చేసే సత్తా ఉన్ననేతల జాబితాను సిద్ధం చేసి.. వారిలో పలువురికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు సైతం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లో చేరిన 11 మంది సర్పంచ్ లు.. ఏడుగురు ఎంటీపీసీలు పార్టీలో చేరేందుకు సిద్ధమైన వేళ.. వారికి మద్దతుగా తరలి వచ్చే వారికి  ఒక్కొక్కరికి రూ.500.. క్వార్టర్ మందుతో పాటు.. బిర్యానీలు ఇచ్చేందుకు తయారైనట్లుగా తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకుండానే ఇలాంటి పరిస్థితి ఉండటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి తమ బలాన్ని ప్రదర్శిచటంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా.. పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్కు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ద్వితీయ శ్రేణి నేతలు.. ఛోటా నేతలు గులాబీ కారులోకి ఎక్కితే లభించే ప్రయోజనం భారీగా ఉండేలా ‘ప్లాన్లు’ సిద్ధం చేసినట్లుగా సమాచారం.

ఇందులో భాగంగా ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న వారికి రూ.10లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి. వారు పార్టీలో చేరేందుకు ఓకే చెప్పినంతనే ఈ భారీ మొత్తం వారికి అందజేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఇలాంటివి మరెన్ని సిత్రాలు తెర మీదకు వస్తాయో?

This post was last modified on August 20, 2022 10:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

29 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

59 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago