మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకుని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే బలప్రదర్శనకూ దిగుతున్నాయి. ఈనెల 20వ తేదీన నియోజకవర్గం కేంద్రం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కనీవినీ ఎరుగనంత స్ధాయిలో జనసమీకరణ చేయాలని ఇప్పటికే కేసీయార్ ఆదేశించారు. 25 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మందిని తీసుకురావాలని టార్గెట్ గా చాలామంది నేతలు పనిచేస్తున్నారు.
కచ్చితంగా టీఆర్ఎస్ ది బలప్రదర్శననే చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ బహిరంగసభ జరిగిన మరుసటి రోజు అంటే 21వ తేదీన నియోజకవర్గంలోని చౌటుప్పల్ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బహిరంగసభ జరగబోతోంది. ఈ సభ నిర్వహణ కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ, బీజేపీలో చేరి మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యక్తిగతంగా సవాల్ లాంటిది. తన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తన సత్తా ఏమిటో చాటాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.
రాజగోపాల్ ఎందుకింత పట్టుదలగా ఉన్నారంటే ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. అమిత్ షా సమక్షంలోనే రాజగోపాల్ పార్టీలో చేరబోతున్నారు కాబట్టే. తానెంతటి శక్తిమంతుడో షాకి చాటి చెప్పేందుకే మాజీ ఎంఎల్ఏ చాలా కష్టపడుతున్నారు. నిజానికి మునుగోడులో రాజగోపాల్ బలమే బీజేపీ బలమని అందరికీ తెలుసు. ఇక్కడ పార్టీకంటు వున్న బలం చాలా నామమాత్రమే. రేపు రాజగోపాల్ గెలిచినా అది పూర్తిగా వ్యక్తిగత విజయమే కానీ పార్టీ వల్ల గెలవటం కాదు.
హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ఎలా గెలిచారో మునుగోడులో రాజగోపాల్ కూడా అలాగే గెలవాలి. ఇందుకే బహిరంగ సభ నిర్వహణ, ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతోంది. టీఆర్ఎస్ బహిరంగసభ జరిగిన మరుసటి రోజే బీజేపీ సభ జరుగుతోంది కాబట్టి కచ్చితంగా హాజరైన జనాల విషయంలో పోలికుంటుంది. ఇక కాంగ్రెస్ కూడా బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ సభ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 19, 2022 6:58 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…