సొంత పార్టీ లేదు.. వైరి పక్షము అన్నది లేదు. తమకు పడని వాళ్లు ఎవరైనా సరే.. తమ మాటల తూటాల తాకిడికి విలవిలలాడేలా వ్యాఖ్యలు చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థి పార్టీల విషయంలో అస్సలు తగ్గనట్టుగా వ్యవహరించే తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సొంత పార్టీ వారిపై కూడా విరుచుకుపడుతుంటారు. అధికారం చేతిలోకి వచ్చిన మూడేళ్లలోనే.. ఏపీలోని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు సొంత పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కమ్ నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీకి చెందిన ఒక నేత సిగ్గుమాలిన పని చేస్తున్నట్లుగా మండిపడ్డారు. నెల్లూరు పట్టణంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వమనే ప్రోగ్రాంలో అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనసులో రగిలిపోతున్న అసంతృప్తిని బయటపెట్టకుండా ఉండలేకపోయారు. మీడియాతో మాట్లాడే వేళలో ఓపెన్ అయిపోయారు. తమ పార్టీలో ఉండి కూడా సిగ్గు లేని పనులు చేస్తున్నట్లుగా ఫైర్ అయ్యారు.
విపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలతో వైసీపీ నేత ఒకరు నిత్యం మంతనాలు నడుపుతున్నట్లుగా ఆరోపించారు. వైసీపీ నేత ఒకరు వెన్నుపోటు రాజకీయాల్ని చేస్తున్నారని.. ఇలాంటి పనులు చేస్తున్న వారి కాల్ డేటా హిస్టరీ మొత్తం తన వద్ద ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు. త్వరలోనే వారి బండారం మొత్తాన్ని బయటపెడతానని చెప్పారు. ఇంతకీ సొంత పార్టీని బలిపెట్టేలా వ్యవహరిస్తున్న నేత ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది.
అయినా.. పార్టీకి చెందిన దరిద్రపుగొట్టు పనులు చేస్తూ.. విపక్షాలతో చెట్టాపట్టాలు వేసుకునే విషయానికి సంబంధించిన ఆధారాలు ఉండి ఉంటే.. ఇలా మీడియా ముందుకు రావటం కంటే.. పార్టీ అధినేతకు గుట్టుగా వివరాలు పంపితే సరిపోతుంది కదా? పార్టీ పరువును తన మాటలతో బజారున పెట్టిన మాజీ మంత్రికి.. ఆయన ఆరోపించినట్లుగా విపక్ష నేతలతో టచ్ లో ఉండటం కూడా ఒకేలాంటి నేరం కదా? అంటూ అనిల్ ఆరోపణలపై మండిపడుతున్నారు. మరి.. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.
This post was last modified on August 19, 2022 4:35 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…