రాజకీయాల్లో రోజులన్నీ.. ఒకే విధంగా ఉండవు. నిన్న ఉన్నట్టుగా ఈ రోజు.. ఈ రోజు ఉన్నట్టు రేపు కూడా ఉండే అవకాశం లేదు. ఈ విషయాన్ని నాయకులు గ్రహించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా.. తమ తమ విధానాలను మార్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మాత్రం ఇలాంటి మార్పు కనిపించడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. నాయకులు పెడచెవిన పెడుతున్నారు.
ప్రజల్లో ఉండాలని.. వారి సమస్యలు తెలుసుకోవాలని.. ప్రజలకు అండగా ఉండాలని.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని.. ఇలా అనేక విషయాలపై చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకుల్లో మార్పు రాలేదు. ఇక, ఇప్పుడు.. మరోసారి నాయకు లకు తలంటే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అంతా కూడా.. నాయకులను తన దగ్గరకు పిలుచుకుని.. వారికి దిశానిర్దేశం చేయాలని భావించారు.
ఈ క్రమంలోనే తాజాగా నాలుగు నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు.. ఇతర నాయ కులతో ఆయన భేటీ అయ్యారు. వీటిలో కీలకమైన పెనమలూరు కూడా ఉండడం గమనార్హం. అదేసమ యంలో సంతనూతలపాడు.. కూడా.. ఉంది. అయితే.. తాజాగా భేటీలోనూ చంద్రబాబు పాడిందే పాట అన్నట్టుగా.. నాయకులకు దిశానిర్దేశం చేయడంతోనే సరిపుచ్చారు. ఎక్కడా వారికి ఎలాంటి వీసమెత్తు హెచ్చరిక కూడా చేయలేదు.
మీరు సరిగా పనిచేయకపోతే.. టికెట్లు ఇచ్చేది లేదని.. సాక్షాత్తూ ఎమ్మెల్యేలకే వైసీపీ అధినేత జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో టికెట్లపై బెంగతోనో.. లేక.. అధినేత ఆదేశాలంటే.. గౌరవంతోనో.. వైసీపీ నాయకులు ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ, ఇలాంటి పరిస్థితి టీడీపీలో కనిపించడం లేదు. చంద్రబాబు చెప్పింది వింటున్నారు.. తలలు ఊపుతున్నారు. తర్వాత.. ఎవరి మానాన వారు తమ తమ పనుల్లో మునిగితేలుతున్నారు. మరి ఈ పరిస్థితి మారాలంటే.. కొంత చంద్రబాబు కూడా మారాలని అంటున్నారు పరిశీలకులు. నాయకులకు బలమైన సంకేతాలు.. పంపాల్సి ఉంటుందని అంటున్నారు.
This post was last modified on August 18, 2022 9:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…