ఎవరు ఔనన్నా.. కాదన్నా..ఏపీలో సంక్షేమ పథకాలు.. ఉచిత పథకాలను విస్మరించే ప్రయత్నం కానీ.. సాహసం కానీ.. ఏ ఒక్క పార్టీ చేసే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అయితే.. ఏకంగా.. సంక్షేమాన్నే ఎన్నికల మంత్రంగా పఠిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేకున్నా.. తమను తమ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలే ఆదరిస్తాయనే విధంగా సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వేల కోట్ల అప్పులు చేసి మరీ.. పథకాలు అమలు చేస్తున్నారు.
అయితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం సంక్షేమం మాటున ఉచిత పథకాలు అమలు చేయడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతోంది. సంక్షేమ పథకాల్లో కోతలు విధించాలని.. ప్రజల నుంచి పన్నులు మరింత పిండాలని.. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. ఇదే విషయాన్ని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు.. ఉచిత పథకాలకు తేడా లేదా? అనేది బీజేపీ యేతర పార్టీలు ఉన్న ప్రభుత్వాలు చెబుతున్న మాట.
అయితే.. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా వ్యాఖ్యానించినా.. ఏపీ సీఎం కానీ.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కానీ.. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా.. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే.. ప్రధాన అజెండాగా ఈ రెండు పార్టీలు కూడా.. ముందుకు సాగనున్నాయి. సంక్షేమాన్ని విస్మరించి.. ఏ పార్టీ కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయలేవు. ఈ క్రమంలో కేంద్రంలోని మోడీని ఎవరు మెప్పిస్తారు? అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్రానికి ఇస్తున్న గ్రాంట్లను కేంద్రం నిలిపి వేసింది. అంతేకాదు. ఇస్తున్న ప్రతి రూపాయికి కూడా లెక్కలు అడుగుతోంది. కొనసాగాల్సిన పథకాలకు కూడా రూపాయి అదనంగా ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు ఒకవైపు.. ఏపీని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మరోవైపు.. అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు తీసేయాలని మోడీ ఆదేశిస్తే.. ఏం చేయాలనేది అంతుబట్టని విషయంగా మారిపోయింది. ఈ క్రమంలో మోడీకి వ్యతిరేకంగా.. గళం విప్పుతారా? లేక.. సర్దుకుపోతారా? అనేది చూడాలి.
This post was last modified on August 17, 2022 7:48 pm
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…