వైసీపీ గ్రాఫ్ దిగజారుతోందా..? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కాదు.. ముఖ్యమంత్రిగా.. సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీనికి కారణం అవుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత వారం రోజుల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.. అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో.. జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యానికి గురి చేశాయని.. మేధావులు సైతం చెబుతున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం అనేవే లేవని.. తాము వచ్చిన తర్వాతే.. అనేక పథకాలు అమలు చేస్తున్నామని.. అందుకే ప్రజలు సుఖంగా ఉన్నారని.. సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు.. విస్మయానికి గురి చేశాయని అంటున్నారు. ఎందుకంటే.. సీఎం జగన్ కు ముందు… తర్వాత.. కూడా ప్రజలు ఉన్నారు. అప్పట్లో అనేక ప్రభుత్వాలు.. పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాయి. పేదలకు రూ.2 కే బియ్యాన్ని తీసుకువచ్చాయి.
ముఖ్యంగా గరీబీ హటావో నినాదం కావొచ్చు.. ఆహార భద్రత, ఉపాధి హామీ వంటి పథకాలు కావొచ్చు.. మహిళలకు ఆస్తిలో హక్కు కావొచ్చు.. ఇలా.. అనేక పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. ఇవేవీ.. ప్రజలకు తెలియవన్నట్టుగా.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడాన్ని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పరిశ్రమల పరంగాను.. పారిశ్రామికంగా.. రాష్ట్రం పురోగతి సాధించడం లోనూ.. తాను వచ్చిన తర్వాతే అడుగులు పడుతున్నాయని జగన్ తాజాగా వ్యాఖ్యానించడంపైనా.. విస్మయం వ్యక్తమవుతోంది.
గతంలో అమెరికాఅధ్యక్షులను ఏపీకి తీసుకువచ్చిన ఘనత.. వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు..చంద్రబాబుకు కూడా దక్కుతుంది. అదేవిధంగా అనేక మంది పారిశ్రామిక వేత్తలను కూడా వారు ఏపీకి రప్పించారు. అసలు సెజ్ అనే విధానానికి జగన్ తండ్రి వైఎస్ బీజం వేశారు. మరి.. ఇన్ని చేసిన వారిని విస్మరించడం.. అంతా తనే చేస్తున్నానని చెప్పుకోవడం ద్వారా.. ఇప్పుడు.. తండ్రి చేసిన.. మేలును కూడా విస్మరిస్తున్నారా? అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం.
తాను చేసింది చెప్పుకోవడం జగన్‌కు తప్పుకాకున్నా.. అసలు ఇప్పటి వరకు ఎవరూ ఏపీని అభివృద్ధి చేయలేదని చెప్పడం ద్వారా.. తన తండ్రిని కూడా జగన్ అవమానిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుపై కోపంతోనో.. రాజకీయ లబ్ధి కోసమో.. చేస్తున్నవ్యాఖ్యలు.. వివాదానికి.. వైఎస్‌ను అవమానించేందుకు దారితీస్తున్నాయని అంటున్నారు.
This post was last modified on August 17, 2022 1:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…