Political News

జ‌గ‌న్ కుంభ‌కోణం బ‌య‌ట‌పెడ‌తా: నారా లోకేష్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. సీఎం జ‌గ‌న్‌కు సంబందించిన భారీ కుంభ‌కోణాన్ని త్వ‌ర‌లోనే తాను బ‌య‌ట పెట్ట‌నున్న‌ట్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. జ‌గ‌న్‌వి ప‌దో త‌ర‌గ‌తి పాస్‌.. డిగ్రీ ఫెయిల్ తెలివి తేట‌ల‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్‌ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవిని పేరిట ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని లోకేష్‌ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ ఆరోగ్యమస్తు – ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఉచిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్న‌ట్టు చెప్పారు. దీనికి అవసరమైన వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను లోకేశ్‌ సమకూర్చారు. ఇక్కడ దాదాపు 200కు పైగా రోగనిర్ధరణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పై ఫైర‌య్యారు. ఆయ‌న‌వి పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటి కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువని ధ్వజమెత్తారు. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే.. చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్ ఢిల్లీ పెద్ద‌ల ముందు తలవంచారని దుయ్య‌బ‌ట్టారు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతానని వెల్లడించారు. మ‌రోవైపు విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నారా లోకేష్‌ మద్దతు తెలిపారు. సీఎం జగన్‌ దళిత ద్రోహిగా మారారని మండిపడ్డారు. విదేశీవిద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

This post was last modified on August 17, 2022 11:32 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

2 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

7 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago