టీడీపీకి కంచుకోట లాంటి ఆ జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా.. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా.. కేరాఫ్‌గా మారి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇంతగా జిల్లాలో రాజకీయం రగులుతున్నా కూడా.. చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏదైతే.. అదే అవుతుంది! అనే విధంగా ఒక నిర్ణయం తీసుకుని.. పార్టీని, నాయకులను లైన్‌లో పెట్టేందుకు మాత్రం ఆయన వెనుకాడుతున్న పరిస్తితి కనిపిస్తోందని అంటున్నారు.
టీడీపీ తలనొప్పిగా మారిన జిల్లానే ఉమ్మడి అనంతపురం. ఇక్కడి ప్రతి నియోజకవర్గంలోనూ.. టీడీపీకి ఇబ్బందులు వస్తున్నాయి. గెలిచిన నియోజకవర్గాలు.. గెలవని నియోజకవర్గాల్లోనూ టీడీపీ సతమతం అవుతోంది. హిందుపురంలో గెలిచిన బాలయ్య.. సినిమా బాట తప్ప.. ప్రజాబాట పట్టిన పరిస్థితిలేదు. అయితే.. ఇక్కడ వైసీపీలో ఉన్న లుకలుకల కారణంగా ప్రజలు ఇప్పటికీ.. టీడీపీవైపు ఉన్నారనే ధైర్యం ఉంది. లేకపోతే.. కష్టమే. ఇక, ఉరవకొండ నుంచి విజయం దక్కించుకున్న పయ్యావుల కేశవ్ ఏపనీ చేయడం లేదనే వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే.. ఆయనపై వ్యూహాత్మకంగా.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారాన్ని మాత్రం కేశవ్ ఖండించలేక పోతున్నారు. ఈ పరిణామాలు.. ఇక్కడ బాగానే వర్కువుట్ అవుతున్నాయి. ఇక, ఓడిపోయిన నియోజకవర్గాలను పరిశీలిస్తే.. టీడీపీ నేతల మధ్య వివాదాలు రోడ్డెక్కుతున్నాయి. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి అగ్గిరాజేశారు. ఈసారి సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్ అని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా ‘పల్లె’పై తిరుగుబావుటా ఎగరేశారు.
ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరిన వరదాపురం సూరిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు. సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే మాత్రం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని, పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకటప్రసాద్ మధ్య కోల్డ్‌వార్ కొన్నిరోజులుగా హీట్ పుట్టిస్తోంది. టికెట్ తమకంటే తమకేనంటూ ఎవరికి వారు సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిది విచిత్ర పరిస్థితి. ఈ సారి నియోజకవర్గ పార్టీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య సమన్వయం లోపించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకే కార్యక్రమంలో కనిపించడంలేదు. ఈరన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా గుండుమల తిప్పేస్వామి తనకు అనుకూలంగా ఉన్న మరొకరిని ఎమ్మెల్యే రేసులోకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మరి ఈ పరిణామాలను ఇప్పటికిప్పుడు సరిదిద్దుకోక పోతే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఇబ్బందులపాలవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 17, 2022 10:53 am
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…